అన్వేషించండి

KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు

Telangana News | కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అమృత్ 2.0 స్కీమ్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంతో పాటు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.

KTR lodge complaint against Revanth Reddy on AMRUT 2.0 scam | ఢిల్లీ / హైదరాబాద్: అమృత్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి రేవంత్ తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని తెలిపారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అన్న కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనులను కట్టబెట్టారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తన బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పజెప్పారని పేర్కొన్నారు.

అమృత్ 2.0 స్కీం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వివిధ పనులకు దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ స్కీం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉంది.  కేటీఆర్ సోమవారం ఢిల్లీకి వెళ్లి ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో...ఆధారాలతో సహా కేంద్రమంత్రి ఖట్టర్ కు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వివరించారు. మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని ఈ టెండర్లపై విచారణ జరిపించాలని  ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
 
2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులా?
అమృత్ టెండర్లలో భాగంగా రూ. 1,137 కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధా ఇన్ ఫ్రాక్చర్ లిమిటెడ్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 2 కోట్ల 20 లక్షల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు. అలాంటి కంపెనీకి రూ. 1,137 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పజెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటేనే తెర వెనుక భారీ అవినీతి బాగోతం జరిగిందని చెప్పారు. మొత్తం రూ. 1137 కోట్ల పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో. లిమిటెడ్ కంపెనీకి 20 శాతం పనులు, మిగతా 80 శాతం పనులను శోధా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు.

మొత్తం ప్రాజెక్ట్ లో 80 శాతం పనులను సీఎం రేవంత్ బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ శోధా సంస్థకు అప్పగించిందని కేటీఆర్ చెప్పారు. అమృత్ టెండర్ల కు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ శాఖకే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగానూ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా ఈ టెండర్ల ను బావమరిదికి అప్పగించటం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని కేటీఆర్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి, అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘన
రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని కేటీఆర్ అన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎంతటి ప్రజా ప్రతినిధులపైనైనా వేటు వేయవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా కేటీఆర్ ఉదాహరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ గనుల కేటాయింపు, బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు (1983), ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు (2005), ది జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2001), దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా (2003) కేసులను కేటీఆర్ ప్రస్తావించారు. 2014 లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో ల్యాండ్ కేటాయింపులు చేసిందో...పొరుగున ఉన్న కర్ణాటకలో ముడా స్కాం లో ఏ విధంగా అక్కడి సీఎం యడ్యూరప్ప తన భార్యకు భూములు కేటాయించారో అదే విధంగా రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని కేటీఆర్ ఆరోపించారు.

Also Read: KTR vs Ponguleti: కేటీఆర్ ను మంత్రి పొంగులేటి ఎందుకు టార్గెట్ చేశారు? కారణాలు ఇవేనా!

ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడితే...
సాధారణంగా రాష్ట్రంలో అధికారులు, మంత్రులు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రికి నివేదిస్తారని.. కానీ కంచె చేను మేసిందన్నట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డియే అవినీతికి పాల్పడటం అనైతికమని కేటీఆర్ అన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను మాత్రమే కాకుండా టెండర్ కేటాయింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో సీఎం రేవంత్ ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారని కేంద్రమంత్రికి కేటీఆర్ వివరించారు.


 
పారదర్శకంగా విచారణ జరిపించండి.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అమృత్ టెండర్లలో చట్టవిరుద్దంగా కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Revanth Reddy: యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget