అన్వేషించండి

KTR Letter To Modi : ‘రోజ్ గార్’ మేళా పేరుతో కబేళాలకు నిరుద్యోగులు - మోసం చేస్తున్నారని మోదీపై కేటీఆర్ ఫైర్ !

ఉద్యోగాల భర్తీ మోసమంటూ ప్రధాని మోదీ కి కేటీఆర్ లేఖ రాశారు. చెప్పినట్లుగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్నారు.

 

KTR Letter To Modi :     ‘రోజ్ గార్’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ అరోపించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత జీవితాలతో పరిహాసమాడడం మాని చిత్తశుద్ధితో, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఘాటైన బహిరంగ లేఖను కె.టి.రామారావు రాశారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పిన మోదీ ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారని.. . అంతటితో ఆగకుండా కేవలం 75 వేల మందికి మాత్రమే నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆరోపించారు.  కేవలం మీ పరిపాలన వైఫల్యం అడ్డగొలు అర్ధిక విధానాల వలనే దేశ అర్ధిక వ్యవస్ధ నేల చూపులు చూస్తున్నదని కేటీఆర్ విమర్శించారు.   కోట్ల ఉద్యోగాలు హమీ ఇచ్చి, కేవలం వేల ఉద్యోగాలతో మీరు చేస్తున్న మీడియా ప్రచారా పటోపం, పదే పదే నిరుద్యోగ యువతతో పరిహాసం అడుతున్నట్లు ఉన్నదన్నారు.  ఆర్భాటపు ప్రచార కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతమీద రుద్దే ప్రయత్నం చేయడం దారుణమని..  రోజ్ గార్ మేళా పేరుతో కబేళాలో బలి పశువుల మాదిరి నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  

8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలెక్కడ ? 
  
బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనకు 8 ఏండ్ల కాలం దాటింది. మీరు ఇప్పటికే ప్రకటించినట్టు ఏటా 2 కోట్ల ఉద్యోగాల ప్రకారం నేటికే 16 కోట్ల ఉద్యోగాలు నింపాలి. కానీ నేటివరకు మీరు భర్తీ చేసిన ఉద్యోగాలెన్నో స్పష్టం చేయగలరా? దీనిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా ? అని కేటీఆర్ మోదీని ప్రశ్నించారు.  మూడున్నర కోట్ల తెలంగాణ జనాభాకు రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లల్లో సూమారు 1 లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసినం, మరో 91 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించినం. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 2,50,000 ఉద్యోగాలకు పైగా భర్తీ  చేస్తున్నపుడు,,130 కోట్ల దేశ జనాభాలో మీరు నింపిన ఉద్యోగాలెన్ని? దాని శాతమెంత ?  అని ప్రశఅనించారు. 

ఏటా 2 లక్షల మంది రిటైర్ !

దేశంలో ఏటా 2 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా సరిగ్గా భర్తీ చేయడం లేదన్నారు.  మీరు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల అమ్మకాల పందేరం వలన సూమారు రెండున్నర లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్ధలో సూమారు 50శాతం ఉన్న రిజర్వుడ్ కేటగిరిలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరకకుండా పోతున్నాయన్నారు.  2014 నంచి 2022  ఎనిమిది  ఏండ్లలో జూన్ 2022 నాటికి కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 7లక్షలు మాత్రమే..ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సూమారు 16 లక్షలున్నాయని మీ ప్రభుత్వమే చెప్పింది. ఈ నేపథ్యంలో మీరు రోజ్ గార్ మేళా ద్వారా కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగులను మీరేం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. 

ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేయాలి !

దేశవ్యాప్తంగా నిరుద్యోగం గతంలో ఎప్పుడు లేనంతగా పెరిగి రికార్డులు నమోదు చేస్తున్నాయని లేఖలో కేటీఆర్ గుర్తు చేశారు.   ఇప్పటికైన ప్రతి ఎన్నికల ముందు ప్రజలను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలి. ఇచ్చిన హమీ మేరకు భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేంటనే చేపట్టాలి. కేవలం మీడియా హెడ్ లైన్లు, పత్రికల్లో ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగ యువతకు అవకాశం ఇచ్చేలా కేంద్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
MLA Mal Reddy: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
MLA Mal Reddy: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం- వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక 
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం- వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక 
Hyderabad Weather: తెలంగాణలో మారిన వాతావరణం- హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గాలి వాన  
తెలంగాణలో మారిన వాతావరణం- హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గాలి వాన  
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Embed widget