(Source: ECI/ABP News/ABP Majha)
KTR News : అంబులెన్స్‌గా కాన్వాయ్ కారు - ప్రాణాన్ని కాపాడిన కేటీఆర్
Telangana News : తన కాన్వాయ్‌లోని ఓ కారును అంబులెన్స్‌గా మార్చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
KTR Saves a life : రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను చూసి చలిస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే అలా వదిలేసి వెళ్లలేరు. అంబులెన్స్ వచ్చేదాకా చూస్తే గాయపడిన వ్యక్తి ప్రాణం గిలగిల్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ తన కాన్వాయ్ లోని వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి.. గాయపడిన వ్యక్తిని హుహాటిహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకుకేటీఆర్ వరంగల్ కు వెళ్లారు. పార్టీ నేతలతో కలిసి కాన్వాయ్ గా వెళ్తున్న సమయంలో వరంగల్ లేబర్ కానీ వద్ద ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించారు. ప్రమాదానికి గురై రోడ్డున పడి ఉన్నారు. ఎవరూ పట్టించుకోకపోడంతో కేటీఆర్ వెంటనే కాన్వాయ్ ను ఆపించారు. పరిస్థితిని గమనించి.. ప్రమాద తీవ్ర ఎక్కువంగా ఉందని తక్షణం వైద్యం అందించాల్సి ఉందికాబట్టి.. తన కాన్వాయ్ లోని వాహనలోకి ఆ బా ధితుడ్ని ఎక్కించి ఉన్న పళంగా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని లేబర్ కాలనీకే చెందిన అంజయ్యగా గుర్తించారు.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తున్న మార్గంలో.. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్ కు గురై కిందపడి ఉన్నాడు. అతన్ని గమనించిన కేటీఆర్ గారు వెంటనే కారు దిగి తన కాన్వాయ్ లోని… pic.twitter.com/Dmkq9kMj8u
— Jagan Reddy (@JaganReddyBRS) May 22, 2024
ప్రజలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తన వద్ద కు వస్తే వీలైనంత వరకూ సాయం చేస్తూంటారు కేటీఆర్. మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఓ బ్యాక్ అప్ ఆఫీసును నిర్వహించేవారు. సోషల్ మీడియాలో ఎవరైనా తనను సాయం కోసం సంప్రదిస్తే వెంటనే తన టీమ్‌ను అలర్ట్ చేసి సాయం అందేలా చూస్తారు. అలా రోడ్డు మీద ప్రమాదానికి గురై పడి ఉన్న వ్యక్తిని ఎవరూ పట్టించుకోకపోయినా కేటీఆర్ మాత్రం పట్టించుకుని ఉన్న పళంగా తన కారులో ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
నిజానికి వీఐపీలు పయనించేటప్పుు భద్రత కారణాలతో మధ్యలో ఆపవద్దని అధికారులు చెబుతూంటారు. కానీ ఇటీవలి కాలంలో చాలా మంది వీఐపీలు.. తమ భద్రత కన్నా.. రోడ్డు మీద ప్రమాదాలకు గురయ్యే వారికి సాయం చేసేందుకు తమ వాహనాలను ఇస్తున్నారు. అంబులెన్స్ లకు సమాచారం ఇచ్చినా వచ్చే సరికి ఆలస్యమవుతుందన్న కారణంగా నేతలు.. చొరవ చూపి వారిని త్వరగా ఆస్పత్రులకు పంపుతున్నారు.