అన్వేషించండి

BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణంలో పార్టీ జెండాలను ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు.

భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం మరియు జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేసి, ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన క్రమంలో పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం 1.30 కల్లా చేరుకోవాలి..

తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని, ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో వేడుకలు ముగించుకుని, ఆహ్వానం ఉన్న ప్రతినిధులు మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హుజూర్‌నగర్ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పిల్లుట్ల రఘు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పిల్లుట్ల రఘుకు కండువా కప్పి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. 

ఫ్లోరోసిస్ సమస్య లేకుండా చేసిన నేత కేసీఆర్

60 ఏండ్లు పాలించిన ఈ కాంగ్రెస్ సన్నాసులు నల్గొండకు కనీసం నీళ్లు ఇవ్వలేదన్నారు. కానీ కేసీఆర్ పదేళ్లలో నల్గొండలోని చివరి మడివరకు నీళ్లు పారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా వేధించిన ఫ్లోరోసిస్‌ను మిషన్ భగీరథతో తరిమికొట్టిన నేత కేసీఆర్ దామరచర్లలో అతిపెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను స్థాపించాం. దేశ ప్రజలు అబ్బురపడేలా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు కేసీఆర్. 

కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారు. గురుకులాలతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారు. ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలతో వైద్య విద్యను అందించారు. కరెంటు కష్టాల రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. నాడు మా పాలనలో కేసీఆర్ చేసిన అప్పు… నేడు తెలంగాణకు పెట్టుబడిగా మారిందని’ కేటీఆర్ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget