అన్వేషించండి

Karnataka Election 2023 Reactions : కర్ణాటక ప్రభావం తెలంగాణపై ఉంటుందా ? ఉండదా ? - కేటీఆర్, రేవంత్ అభిప్రాయాలు ఇవే

తెలంగాణలో కర్ణాటక ఫలితాల ప్రభావంపై కేటీఆర్, రేవంత్ భిన్న స్పందనలు వ్యక్తం చేశారు.

 

Karnataka Election 2023 Reactions :  కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో అందరి దృష్టి తెలంగాణపై పడింది. తెలంగాణలో కర్ణాటక ఎన్నికలపై ప్రభావం ఉంటుందా లేదా అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై కేటీఆర్, రేవంత్ రెడ్డిలు భిన్న స్పందనలు వ్యక్తం చేశారు. 

తెలంగాణపై ప్రభావం ఉండదన్న కేటీఆర్                                          

క‌ర్ణాట‌క‌లో నూత‌నంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి శుభాభినంద‌న‌లు తెలిపారు మంత్రి కేటీఆర్.దరిద్రగొట్టు విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ వెల్లడించారు. అయితే, కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో చూశామని, అదే విధంగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రభావంపై చూపుతాయని అనుకోవడంలేదన్నారు.  భారతదేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు నగరాలను మరింత ఎత్తుకు ఎదగనిద్దామని, ఆరోగ్యకరమైన పోటీతో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనలో ఇంకా ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందిద్దామని పిలుపునిచ్చారు.  

 

 

బీఆర్ఎస్ పనైపోయిందన్న రేవంత్ రెడ్డి                                          

 గాంధీభవన్‌లో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  , ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే , ఏఐసీసీ సెక్రెటరీలు, ఇతర నేతలు  సంబరాలు చేసుకున్నారు.  కోలార్ సభలో రాహుల్ మాట్లాడిన దానికి రాహుల్‌పై   అనర్హత వేటు వేయడం, ఇళ్ళు ఖాలీ చేయించడం కర్ణాటక ప్రజలకు నచ్చలేదన్నారు. అదాని అవినీతిపై మాట్లాడితే రాహుల్‌పై కక్ష సాధించారని మండిపడ్డారు. గులాంనబీ అజాద్ ఎక్స్ ఎంపీ అయి చాలా రోజులు అయిందని.. అయినా ఇళ్ళు ఎందుకు ఖాళీ చేయించలేదని ప్రశ్నించారు.  అదానితో తమకు సంబందం లేదంటున్న బీజేపీ.. అదానిని విమర్శిస్తే బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుందని అడిగారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఓక్కటే అని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే బీఆర్ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

వచ్చే  ఏన్నికల్లో బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 9 సీట్లేనన్న రేవంత్ రెడ్డి  

తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఇరవై ఐదు, ఎంఐఎంకు ఏడు,  బీజేపీకి 9 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. మిగతా సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget