అన్వేషించండి

Kishan Reddy : కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రెడీ - కాంగ్రెస్ ఆ పని చేయాలన్న కిషన్ రెడ్డి

Kaleshwaram Corruption : కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని కిషన్ రెడ్డి కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుతుందా అని ప్రశ్నించారు.

Kishan Reddy Wants  CBI investigation on Kaleswaram corruption :   కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్ అని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, పథకాల అమలులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని అన్నారు.. మరీ కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ   ఆఫీస్‌లో ఆయన  మీడియాతో మాట్లాడారు.   రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ నేరుగా రాష్ట్రానికి చెందిన  వ్యవహారాలపై దర్యాప్తు చేయలేమన్నారు. పైగా జనరల్ కన్సెంట్ ను తెలంగాణ సర్కార్ రద్దు చేసిందని తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ చట్టాన్ని తీసివేసి కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేస్తుందా..? లేక బీఆర్ఎస్‌ను కాపాడుతుందా అని ప్రశ్నించారు.               

బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మా బొరుసు లాంటివి !

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు అని ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా సైలెంట్ అవుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దోషులకు శిక్ష పడాలని ఉందా.. లేదా..? ఉంటే దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని నిరూపించుకోవాలని.. అందుకోసం అయినా సీబీఐ దర్యాప్తు కోరాలని సూచించారు. రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ కోరిన 48 గంటల్లోనే దర్యాప్తు మొదలు అయ్యేలా రెకమాండ్ చేస్తామని అన్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యచరణ చేపట్టాలో చర్చిస్తామని తెలిపారు.

తెలంగాణ ఇమేజ్ గోదావరి పాలు  చేసిన కాళేశ్వరం అవినీతి  

కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిందని... అన్నారం ప్రాజెక్టు కూడా గ్యారేంటీ లేకుండా పోయిందన్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఈమేజ్‌ను గోదావరి పాలు చేసిందన్నారు.  ఈ ప్రాజెక్టు గురించి మరింత విశ్లేషణ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టు గురించి 20 అంశాలపైన నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ ప్రశ్నలు అడుగగా ప్రభుత్వం మారినా కూడా వివరాలు అందజేయలేదని గుర్తు చేశారు. 20 అంశాలలో 11 అంశాలకే అరకొర సమాధానాలు చెప్పారని వెల్లడించారు.

సీబీఐ విచారణకు సిఫారసు  చేస్తే వెంటనే దర్యాప్తు            

ప్రస్తుత ముఖ్యముంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడిన అంశాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు, స్కాంలపై దర్యాప్తు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల గురించి ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు.  అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టపోయిన పిల్లర్స్ మళ్లీ కడతారా లేదా నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ సలహాలు తీసుకుంటారో చెప్పాలని కిషన్ రెడ్డి  డిమాండ్ చేశారు.  ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని న్యాయ విచారణ పేరుతో ఆలస్యం చేస్తోందన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget