అన్వేషించండి

Telangana Elections: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు షాక్, తనిఖీల్లో పట్టుబడే నగదు, కానుకలపై ఈసీ కీలక ఆదేశాలు

Telangana Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో పట్టుబడే నగదుపై అభ్యర్థులకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Elections: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఐదు రాష్ట్రాల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిస్తున్నాయి. దీంతో ఎన్నికలు జరుగుతున్ను రాష్ట్రాల్లోని పార్టీలన్నీ అసెంబ్లీ పోరులో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి.

పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నగదు కట్టడిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనిఖీలలో పట్టుబడిన నగదు, కానుకలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. తనిఖీలలో పట్టుబడే నగదు, కానుకల విలువను అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు ఖరారు అయిన తర్వాత అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని, వారి ఖాతాకు జమ చేయాలని సూచనలు చేసింది. 

బుధవారం తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల అధికారుల ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ టీమ్.. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్రశర్మ ఉన్నారు.  మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌తో సమావేశం అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్దత గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు.

అలాగే బుధవారం రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు సీఎస్ శాంతికుమారితో సీఈసీ అధికారులు భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలతో పాటు శాంతిభద్రతలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం గురించి చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధికారులకు సీఈసీ స్పెషల్ టీమ్ పలు కీలక సూచనలు చేసింది. తనిఖీలను ముమ్మరం చేయాలని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.  తనిఖీలు, నిఘాను మరింత పెంచాల్సిన అవసరముందని సూచించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో కూడా సీఈసీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనిఖీల, నగదు స్వాధీనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత నగదు పట్టుబడిందనే వివరాలను ఆరా తీశారు. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో.. నగదు పంపిణీ మరింత పెరిగే అవకాశముందని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈసీ అధికారులు మరింత నిఘాను పెంచాలని చూస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget