TRS KCR : ఆరు నూరైనా ముందస్తుకు వెళ్లం, జాతీయ రాజకీయాల్లో నాదే కీ రోల్, పీకేను ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్
ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని కేసీఆర్ ప్రకటించారు. గతంలోలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు.
ఆరు నూరైనా ముందస్తుకు వెళ్లే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికలప్పుడు అవసరం ఉందనే ముందస్తుకు వెళ్లాం. ఇప్పుడు ఆ అవసరం లేదని కేసీఆర్ తెలిపారు. ముందస్తు ఊహాగానాలకు చెక్పెట్టారు. వందకు వంద శాతం దేశ రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అది ఎలా భర్తీ కావాలనేదే ముఖ్యమన్నారు. భారత్ ప్రజల అనుకూల ఫ్రంట్ .. అలాంటి రాజకీయ వ్యవస్థ రావాలని తమ కోరికని కేసీఆర్ ప్రకటించారు. అలాంటి ఫ్రంట్‌ను త్వరలోనే చూడబోతున్నారని ప్రకటించారు. అద్భుతమైన కొత్త పద్ధతిలో జాతీయ పార్టీ రావచ్చు కదా అని జోస్యం చెప్పారు. ఇప్పుడు ప్రక్రియ మొదలైందనికేసీఆర్ స్పష్ంట చేశారు.
జాతీయ రాజకీయాల్లో నాదే కీ రోల్!
తప్పకుండా దేశంలో భారీ పరివర్తన అవసరం ఉందని కేసీఆర్ ప్రకటించారు. డెబ్భైఏళ్లుగా చాలా పెండింగ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. యూపీఏలో విద్వేష రాజకీయాలు ఉండేవి కావన్నారు. ఇప్పుడు అవి ఎక్కువ అయ్యాయని గుర్తుచేశారు. ఇలాంటిది ఎవరూ కోరుకోవడం లేదు. హైదరాబాద్‌లో పెట్టుబడులు రావాలా బంద్ కావాలా. చైనా నుంచి అనేక పరిశ్రమలు తరలిపోతున్నాయి. వాటిని భారత్ ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతుంది. వందకు వంద శాతం నేను జాతీయ రాజకీయాల్లో కీలక భూమికి పోషిస్తాను. బేసిక్ స్ట్రక్చరల్ మార్పులు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తెలిపారు. ఈడీ, ఐటీ లాంటి దాడులకు భయపడితే ఉద్యమాన్ని చేసేవాళ్లమా. ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడతాడా... స్కామ్‌లు చేసేవాళ్లు భయపడతారన్నారు.
ప్రశాంత్ కిషోర్ వద్ద ఆర్ట్ ఉంది !
దేశంలో మార్పు కోసం ప్రశాంత్ కిషోర్ తన తో ఉన్నారని అందులో తప్పేముందని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ వద్ద ఆర్ట్ ఉంది. ప్రజల పల్స్ పట్టుకుంటాడు. ఆయన మాతో కలిసి పని చేస్తున్నారు. ఆయన దేశం కోసం, తెలంగాణ కోసం కూడా పని చేస్తారని ప్రకటించారు. ఏడేళ్లుగా ప్రశాంత్ కిషోర్ తన స్నేహితుడని కేసీఆర్తెలిపారు. ఆయన కిరాయి కోసం పని చేయరని..ఎప్పుడూ ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల ప్రభావితం చేయడానికి కేసీఆర్ ముందుకొచ్చాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్‌ను పిలిచి మాట్లాడాను. మీరెండుకు భయపడుతున్నారని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. " లీడర్లను కదిలిస్తే ప్రయోజనం లేదు... ప్రజలను కదిలించాలి. అందుకోసం ఏ ప్రక్రియ అవసరమే దాన్నే అవలంభిస్తాం. దేశంలో అడ్వకేట్లను కదిలిస్తాం. యూనివర్శీటీలను కదిలిస్తున్నాం. డిగ్రీకాలేజీ విద్యార్థులను కదిలిస్తున్నాం. విద్యార్థులను కదిలిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. రోజుకో మూడు నాలుగు గంటలు దీనిపై చర్చిస్తున్నాం. అన్నీ కలిపి మాట్లాడి.. ఒక వేదికపైకి తీసుకొచ్చి చెబుతాం. దాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి." అనికేసీఆర్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నిక్లోల 95- 105 మధ్య సీట్లు గెల్చుకుంటాం !
అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 మధ్య మాకు సీట్లు వస్తాయని కేసీఆర్ ప్రకటించారు. ఇరవై రోజుల తర్వాత ఒక రిపోర్టు ఇస్తానన్నారు. 30 సీట్లు సర్వే చేస్తే పాయింట్ త్రి పర్సెంట్‌తో ఒక సీట్ పోతుందని.. 29 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటుందని కేసీఆర్ ఎక్కడ ఉండాలో కాలం నిర్ణయిస్తుందన్నారు. నోటిఫికేషన్‌లు ఎలా పడితే అలా ఇస్తారా... దానికి కొంత టైం పడుతుందిన్నారు. పాలిటిక్స్‌లో పని చేసేది ట్రెండ్, ఈక్వేషన్, అండ్ సిట్యూయేషన్ అని చాలా లోతుగా స్టడీ చేస్తున్నామని తప్పకుండా 2024 సంపూర్ణ క్రాంతి వైపు భారత్ ప్రయాణం ప్రారంభిస్తుంది. చినజీయర్‌తో వచ్చిన గ్యాప్ విషయంపై మాట్లాడదల్చుకోలేదని.. అలాంటివి అడగవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లు ఎవరైనా రావచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తారు. పాదయాత్ర చాలా ఓల్డ్ వ్యూహం. దాని వల్ల ఇప్పుడు ప్రయోజనం ఉండదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.