By: ABP Desam | Updated at : 04 May 2023 05:25 PM (IST)
వెంటనే హైదరాబాద్ వచ్చేసిన కేసీఆర్
KCR Returns : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఒక్క రోజులోనే ముగిసింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన కేసీఆర్ ఆ కార్యక్రమం పూర్తవగానే మళ్లీ హైదరాబాద్ బయలుదేరారు. నిజానికి రెండో తేదీనే ఆయన ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణఆలతో ఆగిపోయారు. ఢిల్లీలోల పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారని.. మేధావులతో చర్చలు జరుపుతారని.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో .. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని అనుకున్నారు. కాన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే రోజు అయిన నాలుగో తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. తన చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించి.. లంచ్ సమయం అయిన వెంటనే వెనుదిరిగారు. ఎవరితోనూ సమావేశం కాలేదు. మామూలుగా గురువారం అంతా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీలో ఉండాలనుకోలేదు.
ఢిల్లీలోని వసంత్ విహార్ లో నూతనంగా నిర్మించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయ భవనాన్ని పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రా మధ్యాహ్నం సరిగ్గా 1.05 గంటల ముహూర్తానికి పార్టీ ఆఫీసును రిబ్బన్ కట్ చేసి లోపలికి ప్రవేశించారు. ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో ఆయన పాల్గొన్నారు. భవన్‌లో దుర్గామాత అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ కు వెళ్లి తన సీటులో కేసీఆర్ ఆసీనులయ్యారు.పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
2021 సెప్టెంబర్ 2న పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 4 అంతస్తులు, 20 గదులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్తులో కేసీఆర్ చాంబర్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.
కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా నాలుగైదు రోజుల పాటు ఉండి.. పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసి వెళ్తారు. అయితే ఈ సారి ఎందుకో కానీ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం తప్ప మరో కార్యక్రమాన్ని కేసీఆర్ పెట్టుకోలేదు. ఈ అంశంపై పార్టీ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ప పోషించాలనుకుంటున్న కేసీఆర్.... ఇటీవలి కాలంలో ఢిల్లీ పర్యటనలు తగ్గించారు. వచ్చినప్పటికీ ఎక్కువ సమయం ఉండకపోవడం తో ఆయన రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతు చిక్కకుండా ఉందని చర్చించుకుంటున్నారు.
Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్
Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం
Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!