యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !
యాదాద్రి ఆలయం విమాన గోపురానికి కేసీఆర్ గతంలోకేజీ 16 తులా ల విరాళాన్ని ప్రకటించారు. ఆ బంగారాన్ని ఇవాళ సమర్పించారు.
KCR Yadadri :యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మనుమడు హిమాన్షు అందించారు. పూజల అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.ప్రత్యేక పూజలకు వెళ్లే ముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విమాన గోపురం కోసం విరాళాలివ్వాలని గతంలో కేసీఆర్ పిలుపు
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం విరాళాలివ్వాలని గత అక్టోబర్‌లో కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా కేజీ బంగారన్ని ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మేఘా వైఎస్ఆర్‌సీపీ, పీఎఫ్ఐ రెండూ ఒక్కటే్ - బీజేపీ నేత సంచలన ఆరోపణలు !ఇంజనీరింగ్ సంస్థ 6 కేజీల బంగారాన్ని విరాళంగా ప్రకటించింది. కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి 2 కేజీల బంగారం, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారం , జలవిహార్ ఎండీ ఎన్‌వీ రామరాజు కిలో బంగారం, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పటికే 5 కేజీల బంగారం, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు కిలో బంగారం ఇలా అనేక మంది ప్రకటించారు.
125 కిలోల బంగారంతో యాదాద్రి విమాన గోపురం
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ యాదాద్రిలో పిలుపునిచ్చారు. తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ విరాళాన్ని కేసీఆర్ ఇప్పుడు సమర్పించారు. సామాన్య ప్రజలు కూడా విరాళాలిస్తున్నారు. విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్ ను తీసుకొచ్చారు. యాదగిరిగుట్టలోని ఇండియన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIB000Y011 ను అందుబాటులోకి తెచ్చారు.
విరాళంగా ప్రకటించిన బంగారాన్ని హిమాన్ష్ చేతుల మీదుగా అందించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రిని అద్భుతంగా అభివృద్ది చేశారు కేసీఆర్. ఆలయ ప్రారంభోత్సవం కూడా ఇటీవలే్ జరిగింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు విమనగోపురాన్ని బంగారం తాపడం పూర్తి చేస్తే మరింత మెరిసిపోయే అవకాశం ఉంది.