అన్వేషించండి

KCR Review : పార్లమెంట్ నియోజకవర్గాలపై కేసీఆర్ సమీక్షలు - నలుగురు అభ్యర్థులపై క్లారిటీ !

KCR Review : పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న కేసీఆర్ అభ్యర్థులపై స్పష్టత ఇస్తున్నారు. అన్ని పార్లమెంట్ స్థానాలపై సమీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

KCR giving clarity on MP Candidates :   పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. వరుసగా పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం  కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు.   సోమవారం ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమైన కేసీఆర్‌.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు.

సమావేశాల్లో అభ్యర్థులపైనా కేసీఆర్ స్పష్టత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ పోటీ చేసే అంశంపై స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించనున్నారు. సిట్టింగ్ ఎంపీ  బీఆర్ఎస్ కు చెందిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కొత్త అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. బాల్క సుమన్ తో పాటు కొప్పుల ఈశ్వర్ పేరును పరిశీలించారు. చివరికి కొప్పుల వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇక ఖమ్మం  నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేశారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే.. నామా పేరును కేసీఆర్ ప్రకటించారు. ఇక మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే మరోసారి చాన్సిచ్చారు.  సమీక్షలు జరుపుతున్నప్పుడే కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. 


సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్‌కు జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాలేదు. తెల్లం వెంకట్రావు ఆదివారం కుటుంబంతో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఉన్న హోటల్ కు వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు అయితే అధికారికంగా పార్టీలో చేర్చుకునే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివసారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన తెల్లం వెంకట్రావ ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరారు. కానీ టిక్కెట్ రాదని తెలియడంతో మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 

బీఆర్ఎస్‌కు వలస సమస్య పెద్దదిగా మారుతోంది. సిట్టింగ్ ఎంపీలు , పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలు వరుసగా పార్టీ మారిపోతున్నారు. బీజేపీ లేదా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కేసీఆర్‌కు కత్తి మీద సాములా మారింది.                                           

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియోKaloji Kalakshetram in Warangal | ఠీవీగా కాళోజీ కళాక్షేత్రంPushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Embed widget