By: ABP Desam | Updated at : 12 Jan 2023 02:44 PM (IST)
మహబూబాబాద్ కొత్త కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
KCR Mahaboobabad : మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం ఆప్ఘనిస్థాన్‌లా అవుతుందని..దీనిపై యువత ఆలోచన చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగసభలో మాట్లాడారు. కేంద్రం అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు. మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. దేశ అభివృద్ధిపై యువకులు చర్చిచాలన్నారు. యువకులు ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యనించారు. 20 ఏండ్లు గడిచినా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు రావటం లేదని ఆరోపించారు.
మహబూబాబాద్ బాగా అభివృద్ధి చెందుతోందన్న కేసీఆర్
గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మహబూబాబాద్ కు వచ్చినప్పుడు తుంగతుర్తి, పాలకుర్తి, వర్ధన్నపేటలో కాల్వలు సగం గీకి, తీసినవి ఉన్నాయన్నారు. వీటిని చూసి ఈ జన్మలో నీళ్లు రావనుకున్నా. మంచిర్యాల, ములుగుకు వచ్చినప్పుడు చిల్లర వేసి మా నేలకు నీళ్లు రావాలని కోర్టుకున్నా. ఇక రాష్ట్రం సాకారం కావాలని కురవి వీరభద్ర స్వామిని కోరుకున్నా. అందుకే బంగారు మీసాలు చేయిస్తానని మొక్కుకొని తీర్చాను. మహబూబాబాద్ గతంలో చాలా వెనకబడ్డ ప్రాంతాలు. కానీ ఇప్పుడు జిల్లాగా మారి అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు - పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
జిల్లాకు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 250 పైగా రాష్ట్రం వచ్చాక ఏర్పాటు చేశాం. గిరిజన బిడ్డలే సర్పంచ్ అయ్యి ఉన్నారు. ఈ సందర్బంగా ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటి వరకూ 16 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి !
అంతకుముందు మహబూబాబాద్ లో బీ కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే 14 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కార్యకలాపాలు మొదలుపెట్టారు. మరో రెండు కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించారు. అధికార వికేంద్రీకరణకుతోడు పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా మార్చింది. కొత్త జిల్లాలతోపాటు, పాత జిల్లా కేంద్రాల్లోనూ ప్రభుత్వ శాఖల సేవలన్నీ ఒకే గొడుగు కింద లభించేలా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టింది. 29 జిల్లాల్లో రూ.1581.62 కోట్లతో కలెక్టరేట్ల నిర్మాణం మొదలుపెట్టింది.
Medak Accident News: మెదక్ జిల్లాలో కూలిన ఫైటర్ జెట్ విమానం - ఇద్దరు దుర్మరణం?
First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్ వేరే లెవల్- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Syed Modi International 2023 badminton: టైటిల్ లేకుండానే ముగిసిన భారత్ పోరాటం , రన్నరప్ గా తనీష-అశ్విని జోడి
/body>