Breaking News Live: హైదరాబాద్‌లోని స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు, ఒక స్టూడెంట్ మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
Student Death: హైదరాబాద్‌లోని స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు, ఒక స్టూడెంట్ మృతి

హైదరాబాద్‌లోని కృష్ణా నగర్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లోని విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. 
 సాయికృప స్కూల్‌లో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మాటా మాట పెరిగి ఆ వివాదం కాస్తా ముదిరింది. ఇద్దర విద్యార్థులు కొట్టుకున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ కొట్లాటో మన్సూర్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన మన్సూర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. 

IT Raids in Tamilnadu: తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

తమిళనాడులో డీఎంకే పార్టీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నైతో పాటు, తిరుచ్చి, కాంచీపురం సహా మొత్తం 25 జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి. అన్నా డీఎంకే పార్టీ నుంచి డీఎంకే పార్టీలో చేరిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

Yadlapati Venkata Rao: యడ్లపాటి అంత్యక్రియల్లో పాల్గొన్న చంద్రబాబు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంక్రటావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన అంతిమయాత్రలో టీడీపీ సీనియర్‌ లీడర్లు కూడా పాల్గొన్నారు. యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. టీడీపీ జెండాను యడ్లపాటి పార్థివ దేహంపై ఉంచిన చంద్రబాబు అంజలి ఘటించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని శ్మశానవాటికలో యడ్లపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెనాలిలోని నివాసం నుంచి శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో చంద్రబాబు కాలినడకన పాల్గొన్నారు.

KTR: హైదరాబాద్‌తో చెత్త తరలింపునకు ఆధునిక వాహనాలు

హైదరాబాద్ నగరంలో చెత్త తరలింపునకు అత్యాధునిక భారీ వాహనాలను వినియోగించనున్నట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది. 40 కొత్త ట్రక్కులను మంత్రి కేటీఆర్, తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.

Warangal: వరంగల్ జిల్లా కాశీబుగ్గలో అగ్ని ప్రమాదం

వరంగల్ జిల్లా కాశీబుగ్గలో అగ్ని ప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని ఓ బట్టల దుకాణంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో దుకాణం పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, మరోవైపు రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బంగాళాఖాతంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వెదర్ మ్యాన్ రిపోర్ట్ చేశారు. ఈ అల్ప పీడనం ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు వైపుగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఏపీ తీరం వైపు గాలులు వీచే అవకాశం ఉందని సైతం హెచ్చరించారు. ఏపీలో త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మత్స్యకారులకు హెచ్చరిక 
అల్పపీడనం, ఆగ్రేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం (AP Weather Today) తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీచడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి కారణంగా ఈ ప్రాంతాల్లో ఉక్కపోత సైతం అధికం అవుతుంది. మత్స్యాకారులకు సైతం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట దక్షిణ దిశ నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. జంగమేశ్వరపురం, బాపట్లలో, నందిగామలో, అమరావతిలో, తునిలో, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాయలసీమలో ఉక్కపోత..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇక్కడ సైతం రాత్రిపూట చలి మళ్లీ పెరిగింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. రెండు రోజులు వేడి కారణంగా ఒక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. మార్చి 4 నుంచి మార్చి 6 తేదీలలో చిత్తూరు, కడప​, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసింది. ఆరోగ్యవరంలో, అనంతపురంలో, కర్నూలులో , నంద్యాలలో, తిరుపతిలో ఉదయం ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట చలి సైతం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రిపూట చలి ప్రభావం తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రత 20 నమోదు కాగా, పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మార్చి 4 నుంచి రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని  తెలిపారు.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నేడు కాస్త తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో నాలుగు రోజుల క్రితం బంగారం ధర అతి భారీగా ఎగబాకిన సంగతి తెలిసిందే. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి.. నిన్న మళ్లీ ఒకేసారి గ్రాముకు 60 వరకూ పెరిగిపోయింది. తాజాగా నేడు రూ.30 తగ్గింది. వెండి ధర మాత్రం రూ.0.10 పైసలు పెరిగింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,950 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.70,000 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,950గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,000 వేలుగా ఉంది.

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా