అన్వేషించండి

KCR: ఛోటా భాయ్‌కి ఓటేసినా, బడే భాయ్‌కి ఓటేసినా ఒకటే - కేసీఆర్

Telangana Elections 2024: హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగునా స్వాగతం లభించింది. సాయంత్రం మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు.

KCR Comments in Mahabub Nagar: తెలంగాణలో ఈడ చోటే భాయ్ కి ఓటేసినా కేంద్రంలో బడే భాయ్ కి ఓటేసినా ఒకటే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం అని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర 3 రోజు మహబూబ్ నగర్ కు చేరుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. సాయంత్రం మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు.

పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో వున్నాయి. వీటిలో ఏ పార్టీ మనకు మేలు చేస్తదో ఆలోచన చేయాలి. బీజేపీ మనకేమన్నా మేలు చేసిందా ఈ పదేండ్ల సంది. మోదీ వంద నినాదాలు చెప్పిండు ఒక్కటన్న నిజమైందా? సబ్ కా వికాస్ అన్నడు కానీ సత్యనాశ్ చేసిండు. అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా? నేను గెలిస్తే 15 లక్షలు మీ బ్యాంకుల వస్తాయన్నాడు వచ్చినయా? నరేంద్ర మోదీ విశ్వగురువు ఎట్లాయే?

పాలమూరు ఎత్తి పోతల కోసం వంద ఉత్తరాలు రాసినం జాతీయ హోదా ఇచ్చిండా..? లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నింపిండా..? రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు వందలాది రైతుల మరణాలకు కారణమైండు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఈడ చోటే బాయికి ఓటేసినా ఆడ బడే బాయికి ఓటేసినా ఒకటే.. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన మోదీకి ఎందుకెయాలే ఓటు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం. 

ఆంధ్రాకు నీళ్లు మలుపుక పొమ్మని హారతులు పట్టిన డీకే అరుణకు ఓటెందుకెయ్యాలే..? మాకు ఓటేస్తే నిమిషాల మీద ఇదిస్తాం అదిస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తోంది. రైతు బందు వచ్చిందా? రుణ మాఫీ అయ్యిందా? పంటలకు బోనస్ వచ్చిందా? స్కూటీ ఇయ్యలేదు గానీ లూటీ అయితే నడుస్తాంది. తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? ఆసరా పింఛను పెంచిండ్రా. ఫీజు రీఎంబర్స్‌మెంట్ లేదు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ బంద్. ప్రతి విషయంలో ప్రతి స్కీమ్ లో మోసం దగా. నాకండ్ల ముందట్నే తెలంగాణను ఆగం చేస్తానంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రబోడు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ దీన్ని గెలిపించాలని ముస్లింలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 

బీజేపీ గెలిస్తే ఎంతో నష్టం జరుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ రొండు ఒకటే. వీళ్లు ఇద్దరు కలిసి భువనగిరిలో బీఆర్ఎస్ ను దెబ్బతీసినాయి. సీఎం స్థాయిలో ఉండి పెగులుపీకుతా ముడ్డి మీది చెడ్డి గుంజుతా జైళ్ల ఎస్తా అంటండు ఇది పద్దతేనా? తెలంగాణ తెచ్చిన నన్ను అట్లా అనుడు మర్యాదేనా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు దేవుని మీద ఓట్లు పెట్టి ఓట్లడుగుతాండ్రు. 20 ఎకరాల రైతులు గూడా గోసపడ్డారు. ఐదు ఎకరాలకు మించితే రైతుబంధు ఇయ్యను అంటానవ్ నీ అయ్యా జాగీరా?ఆరో ఎకరం ఏడ బోవాలే..? బీఆర్ఎస్ కు మీరిచ్చే శక్తి మీ శక్తే.. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి’’ అని కేసీఆర్ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget