KCR Birthday Celebrations: తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు, 1000 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్
Telangana Bhavan KCR Birthday: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకల్ని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. 1000 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ కల్పించారు.
KCR Birthday Celebrations In Telangana Bhavan: హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, BRS పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు (KCR Birthday Celebrations) శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ సంబరాల ఏర్పాట్లను, నిర్వహణను చేశారు. ఈ వేడుకలకు KTR ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
1000 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్
ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జన్మదిన వేడుకల సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో 1000 మంది ఆటో డ్రైవర్ లకు ఒకొక్కరికి లక్ష రూపాయల కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను ఇచ్చారు. 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్ లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా KCR 70 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు.
అనంతరం KCR జీవితం, రాజకీయ మైలురాళ్లు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన అతనే ఒక చరిత్ర డాక్యుమెంటరీని ప్రదర్శించారు. డాక్యుమెంటరీ ని గొప్పగా చేశారని తలసాని సాయి కిరణ్ యాదవ్ ను కేటీఆర్ అభినందించారు. తెలంగాణ భవన్ ఆవరణలో తెలంగాణ ఉద్యమం, KCR ఆమరణ దీక్ష విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు BRS పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీమంతరులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు అన్నారు. BRS పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది BRS పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద భీమా క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, BRS పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలలో ఎంపీలు రంజిత్ రెడ్డి, BB పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ లు సోమా భరత్ కుమార్, అనిల్ కుమార్ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, మసి ఉల్లా ఖాన్, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.