Sarpanch Elections Update: ప్రజాధనంతో రేవంత్ చేస్తున్నది పంచాయతీ ఎన్నికల ప్రచారమే -కవిత ఆరోపణ - ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
Kavitha: ప్రభుత్వ ధనంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలంగాణ జాగృతి ఆరోపించింది. ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని కలిసి కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు.

Telangana Sarpanch Elections: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నా సీఎం టూర్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మేము అభ్యంతరం చెబుతున్నామని.. అర్బన్ ఏరియాల్లో ప్రజాధనంతో మీటింగ్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ టూర్ మీద ఆంక్షలు పెట్టాలి. లేదంటే నిలిపివేయాలని మొదటి రోజే మేము డిమాండ్ చేశామని.. ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా రాశామన్నారు. ఆ సందర్భంగా ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఈసీ అధికారులు మాకు చెప్పారు. కానీ సీఎం మాట్లాడిన మాటలు కచ్చితంగా మొరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల కాపీలను మేము ఈసీకి అందజేశామని.. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం ఎలక్షన్ కోడ్ ఉండేదన్నారు. కానీ ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలో కోడ్ లేకుండా మినహాయింపు తెచ్చారని ఈ లూప్ హోల్స్ అడ్వంటేజ్ గా చేసుకొని సీఎం ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ధనంతో నిన్న స్కూల్ పిల్లలను నింపి మీటింగ్ పెట్టారు.రాష్ట్రంలో ఫెయిర్ అండ్ ఫ్రీ గా ఎన్నికలు జరగాలంటే వెంటనే సీఎం టూర్ ని నిలిపివేయాల్సిందేనన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామని కవిత ప్రకటించారు. అదే విధంగా చాలా ఏరియాల్లో యాక్షన్ నిర్వహిస్తూ సర్పంచ్ పదవిని సొంతం చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. గద్వాల్ లో కొన్ని ఊర్లలో ఆగడాలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. నల్గొండలో బీసీ బిడ్డను నిర్బధించి గెలవాలని చేసిన ప్రయత్నాన్ని కూడా చెప్పామన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రభుత్వ ధనం వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని కోరడం జరిగింది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2025
మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి… pic.twitter.com/gsB02Z3mFt
సీఎం మాత్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రూఫ్స్ తో కచ్చితంగా ఈసీ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే సరే. కానీ ప్రజాధనంతో ఇలా చేయటం సరికాదన్నారు. ఎన్నికల కోడ్ రాజకీయ పార్టీలు ఎలా ఉల్లంఘిస్తాయన్న దానిపై నేను చాలా స్టడీ చేశానని.. ఈ అంశాన్ని మిగతా ప్రతిపక్షాలు కూడా సీరియస్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓ పక్క ఓటు చోరీ గురించి కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదని రాహుల్ గాంధీ గారు అంటారు. కానీ ఇక్కడ కూడా సీఎం కోడ్ ఉల్లంఘన చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. మేము ఇచ్చిన ఫిర్యాదు పై రేపు కూడా స్పందించకపోతే మళ్లీ, మళ్లీ రిప్రజెంటేషన్ ఇస్తామని.. అదే విధంగా మీడియా ద్వారా ప్రజలకు ఈ అంశాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటామని ప్రకటించారు.





















