Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఆహ్వానం
Telangana CM Revanth Reddy | డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజసింగ్ సమ్మిట్ కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Telangana News | న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో వరుస భేటీలు అవుతున్నారు. మొదటగా ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ కు హాజరుకావాలని ఆహ్వానించారు.

ఢిల్లీ: హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరుకావాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు..పార్లమెంట్ లో కేంద్ర మంత్రిని సీఎం కలిశారు. ఈ సందర్భంగా సమ్మిట్ లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి విడివిడిగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్' లక్ష్యాలను వివరించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంకతో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో ఉన్నారు.






















