అన్వేషించండి

Mystery Temple: కరీంనగర్ జిల్లాలో ఆ చారిత్రక ఆలయంలో ఏం జరుగుతోంది, ఎందుకు మూతపడింది!

Karimnagar News | కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పురాతనమైన వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి ఆలయం నెలకుంది. సుమారు 1600 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Sri Venugopala Swamy Temple Telugu News | చొప్పదండి: సామాన్యంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్తే ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరమైన ప్రదేశంలో భక్తితో ప్రశాంతతతో ఉంటారు. కొంతమంది మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్తారు. ఎందుకంటే...? ఆలయంలో అడుగు పెట్టగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలయంలో నిర్వహించే పూజలు భజనలతో మైండ్ రిలాక్స్ అవుతుందని నమ్మకం. కానీ ఈ ఆలయంలో మాత్రం అడుగుపెట్టగానే తల నుంచి మొదలుకొని అరికాలు వరకు వణుకు పుడుతుంది. సుమారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం మూతపడింది అసలు ఈ ఆలయంలో ఏం జరుగుతుంది...? ఈ ఆలయంలో పూజలు ఎందుకు నిర్వహించడం లేదు...?

Mystery Temple: కరీంనగర్ జిల్లాలో ఆ చారిత్రక ఆలయంలో ఏం జరుగుతోంది, ఎందుకు మూతపడింది!

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పురాతనమైన వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి ఆలయం నెలకొంది. సుమారు 1600 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో ఎంతో వైభవంగా వేణుగోపాల స్వామి వారికి నిత్యం పూజలు నిర్వహించేవారు. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేవారని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఆలయంలో గర్భగుడిలో వేణుగోపాలస్వామి దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, అమ్మవారు కూడా ఉంటారు. అయితే ఈ ఆలయంలో వేణుగోపాల స్వామిని దర్శించి పూజలు ఆచరించిన వారికి సకల కోరికలు తీరేవని గ్రామస్తులు చెబుతున్నారు.

Mystery Temple: కరీంనగర్ జిల్లాలో ఆ చారిత్రక ఆలయంలో ఏం జరుగుతోంది, ఎందుకు మూతపడింది!

ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో పురాతన కాలం నుంచి పూర్వకాలంలో హనుమంతు అనే అర్చకులు గా ఉండేవారు. ఆలయంలోని వేణుగోపాల స్వామికి నియమనిష్టలతో ఎంతో ఘనంగా వైభవంగా పూజలు నిర్వహించే వారిని అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో కాళీమాత విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పూజలు నిర్వహించే వారిని గ్రామస్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వేణుగోపాలస్వామి తోపాటు కాళీమాతకు కూడా క్షుద్ర పూజలు నిర్వహించి నాటు వైద్యం చేసేవారని గ్రామస్తులు అంటున్నారు. నాటు వైద్యం చేస్తున్న విషయం కొన్ని ప్రాంతాలకు పాకడంతో ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ నాటువైద్యం చేయించుకునే వారు. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుందని గ్రామస్తులు అన్నారు.

Mystery Temple: కరీంనగర్ జిల్లాలో ఆ చారిత్రక ఆలయంలో ఏం జరుగుతోంది, ఎందుకు మూతపడింది!

అయితే సుమారు 50 సంవత్సరాల క్రితం ఆలయ అర్చకుడు హనుమంతు తాను మరణిస్తే తన దేహాన్ని ఆలయ ప్రాంగణంలోనే పూడ్చి పెట్టాలని గ్రామస్తులతో అన్నారని చెప్పారు. అయితే చెప్పిన కొద్ది రోజులకే అర్చకులు మరణించడంతో తాను చెప్పిన విధంగా ఆలయంలో కాకుండా గ్రామ శ్రేయస్సు కోసం పెద్దల నిర్ణయం ప్రకారం అంతక్రియలు స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం ఎలాంటి పూజలకు నోచుకోవడం లేదని అప్పుడప్పుడు ఆలయ ప్రాంగణంలో ఏవో రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు కూడా వచ్చేవని గ్రామస్తులు తెలిపారు. కానీ ఈ గ్రామస్తులకు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని తాము ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడం లేదని మరికొందరు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Surya Narayana Temple Budagavi : ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Surya Narayana Temple Budagavi : ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
Indian Migrants: భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!
భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!
Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
Nagasadhu Aghori Arrest: వివాదాస్పద నాగసాధు అఘోరిని అదుపులోకి తీసుకున్న సిరిసిల్ల పోలీసులు
వివాదాస్పద నాగసాధు అఘోరిని అదుపులోకి తీసుకున్న సిరిసిల్ల పోలీసులు
Arasavalli Temple: దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
Embed widget