అన్వేషించండి

సాయంత్రం ప్రారంభం కానున్న బండి సంజయ్ యాత్ర- హైకోర్టు ఆదేశాలతో మారనున్న రూట్ మ్యాప్

భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ జరుపుకోమని బండి సంజయ్‌కు సూచించిన హైకోర్టు... మరికొన్ని షరతులు విధించింది. ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని సూచించింది.

ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.  కాసేపట్లో కరీంనగర్‌ నుంచి బయల్దేరి నిర్మల్ చేరుకుంటారు. అక్కడ ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లి  ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత యాత్రను ప్రారంభస్తారు.  హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రేపు(మంగళవారం) మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరిస్తూ రూట్‌ మ్యాప్‌ను బీజేపీ రూపొందించనుంది. 

కోర్టు అనుమతితో యాత్ర

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. అందుకోసం కొన్ని షరతులు విధించింది. అయితే, యాత్ర భైంసా పట్టణం నుంచి వెళ్లకూడదని, అవసరమైతే భైంసాకు మూడు కిలో మీటర్ల దూరంలో సభ జరుపుకోవచ్చని సూచించింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని సూచించింది. శాంతి భద్రతలను పూర్తిగా పోలీసులే కాపాడాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ జరుపుకోమని బండి సంజయ్‌కు సూచించిన హైకోర్టు... మరికొన్ని షరతులు విధించింది. ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని సూచించింది. ఇతర మతస్తులను కించపరిచేలా వ్యాఖ్యలు వద్దని ఆదేశించింది. సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలని తెలిపింది. సభకు మూడు వేల మంది కంటే ఎక్కువ మందిని అనుమతించి వద్దని కూడా వారించింది. కార్యకర్తల చేతిలో ఆయుధాలు, కర్రలను తీసుకెళ్లొద్దని కూడా తెలిపింది. పాదయాత్ర కూడా ఐదువందల మందితో చేయాలని చెప్పింది. 

రాత్రి నుంచి హైడ్రామా

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌కు ఐదో విడదత పాదయాత్రపై నిన్న రాత్రి నుంచి హైడ్రామా నడుస్తోంది. ఇదివరకే నాలుగు విడతల పాదయాత్ర ముగియగా, ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి(నవంబర్ 28) నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ అనుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బండి సంజయ్ పాదయాత్రకు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. కానీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్‌ జిల్లా ఎస్పీ సురేశ్‌ స్పష్టం చేశారు. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ బైంసా నుంచి ప్రారంభించి, కరీంనగర్‌లో భారీ సభతో ముగించాలని తొలుత భావించారు.

ఐదో విడత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా బండి సంజయ్ నిర్మల్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల దాటాక ఆయన్ని అడ్డుకున్నారు. బండి సంజయ్ వెనక్కి తిరిగి వెళ్లకపోవడంతో జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, బీజేపీ శ్రేణుల సహాయంతో బండి సంజయ్ పోలీసుల నుంచి తప్పించుకుని కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లారు. అక్కడ పోలీసులు ఆయనతో మాట్లాడి తిరిగి ఇంటికి పంపించేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఆయన తిరిగి కరీంనగర్ వచ్చేశారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP DesamUS Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABPNallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABPNita Ambani Visits Balkampet Yellamma Temple |బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ...| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget