News
News
X

Rani Rudrama on KTR: "మంత్రి కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ - పనిగట్టుకొని విష ప్రచారాలు"

Rani Rudrama on KTR: మంత్రి కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని పని గట్టుకొని మరీ బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఫైర్ అయ్యారు. 

FOLLOW US: 
Share:

Rani Rudrama on KTR: తెలంగాణలో సీఎం కేసీఆర్ రాజరిక పరిపాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. తామే దేవుళ్లం, తాము చేసిందే వేదం, శాసనం అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న గవర్నర్, రాష్ట్రపతులను అందులోనూ ముఖ్యంగా ఆ పదవిలో కొనసాగుతున్న మహిళలను గౌరవించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బుధవారం కరీంనగర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో మంత్రి కేటీఆర్ వివిధ పర్యటనల సందర్భంగా బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. 

పదేపదే తప్పుడు ప్రచారాన్ని నిజం చేయాలని మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ అయ్యారని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీపై వ్యాఖ్యలు చేసే ముందు మంత్రి కేటీఆర్ అవగాహనతో మాట్లాడాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్ వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, అందులో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే ఉందని తెలిపారు.

సిద్దిపేట-హుస్నాబాద్ -ఎల్కతుర్తి రెండు వరుసల రహదారి ఉందని ఆమె వివరించారు. విద్య, వైద్యం, గ్రామీణ రహదారులు, ఇతరత్రా అవసరాల కోసం.. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం  ఎంపీ బండి సంజయ్ ఎన్నో నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ఇలాంటి అభివృద్ధి పనులు మంత్రి కేటీఆర్ కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. ఈటల రాజేందర్ ఉద్యమ నేత, ప్రజల మెచ్చిన నేతని.. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి తానేంటో నిరూపించుకున్నారని అన్నారు. 

ప్రధాని మోడీ ప్రభుత్వంపై విష, అసత్య ప్రచారం మంత్రి కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని ఆమె మండి పడ్డారు. అప్పులు చేస్తున్నా జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని ఆరోపించారు. పథకాలు పక్కాగా అమలు కావడం లేదన్నారు. పన్నులు పెంచి, చార్జీలు పెంచి, భూములను అమ్మి, వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర సర్కారు.. చివరికి అప్పులపైనే ఆధార పడుతుందని చెప్పుకొచ్చారు. ఏటేటా తీసుకుంటున్న అప్పును పెంచుకుంటూ పోతుందని ఆమె గుర్తు చేశారు. అలా సర్కారు తెచ్చిన రుణాలు బడ్జెట్‌కు రెండింతలు అయ్యాయనన్నారు. గ్యారంటీల పేరుతో తీసుకున్న అప్పుల్లో.. రాష్ట్రం దేశంలోనే టాప్‌లో ఉందన్నారు. అప్పు ఇంత చేస్తున్నా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, నిధుల్లోనూ కోతలు పెడుతూ, కేంద్ర నిధులను అడ్డగోలుగా వాడుకుంటూ.. సర్కారు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాబడి పెంచుకునేందుకు జనంపై టాక్స్‌‌లు, వ్యాట్‌‌లు వేస్తోందని, అనుకున్న దాని కంటే ఎక్కువే ఆదాయం ఆర్జిస్తోందనీ రాణి రుద్రమ చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల కేసీఆర్ సర్కార్ పాలనలో భూముల విలువలు 150 శాతం దాకా పెంచి రిజిస్ర్టేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచిందని.. ఆర్టీఏలో లైఫ్ టాక్స్, క్వార్టరీ టాక్స్, గ్రీన్ టాక్స్, సెస్​ల పేరుతో 30 నుంచి 40 శాతం దాకా బాధిందన్నారు. కరెంట్ బిల్లుల్లో ఏడీసీ చార్జీల పేరుతో వసూలు చేస్తోందన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌‌ వ్యాట్‌‌ను కేంద్రం తగ్గించుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడంతో ఆ రాబడి కూడా అధికంగానే వస్తోందని వివరించారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుంటూ.. వాటితోనూ ప్రభుత్వం ఆదాయం పొందుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతుందని ఆమె మండిపడ్డారు. ఇలాంటి టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మంత్రి కేటీఆర్ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

రాష్ట్రాల అభివృద్ధిల కోసమే కేంద్రం అప్పులు చేస్తుందనే విషయం మంత్రి కేటీఆర్ తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. 70 ఏళ్ల దేశ పాలనలో ఎప్పుడు లేని విధంగా మోడీ ప్రభుత్వం గ్రామ రహదారి మొదలుకొని దేశ బార్డర్ వరకు రహదారులను నిర్మిస్తుందని రాణి రుద్రమ అన్నారు. దేశ ప్రజల భద్రత, రక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతుందని.. దేశంలోని రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి, జెల్ల సుధాకర్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బల్బీర్ సింగ్, 58వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ రాపర్తి విజయ, మామిడి చైతన్య, ఆవుదుర్తి శ్రీనివాస్, పోరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాసం గణేష్, పురం హరి తదితరులు పాల్గొన్నారు. 

Published at : 01 Feb 2023 08:48 PM (IST) Tags: KTR Comments Minister KTR Telangana News BJP Fires on BRS Rani Rudrama on KTR

సంబంధిత కథనాలు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Bandi Sanjay Letter To KCR: ఆ పథకాన్ని రూపొందించండి - సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Letter To KCR: ఆ పథకాన్ని రూపొందించండి - సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

Minister Gangula Kamalakar: స్కాంలకు పెట్టింది పేరే కాంగ్రెస్, బీజేపీ సర్కారులో జాబ్స్ అమ్మకాలు కామన్: మంత్రి గంగుల

Minister Gangula Kamalakar: స్కాంలకు పెట్టింది పేరే కాంగ్రెస్, బీజేపీ సర్కారులో జాబ్స్ అమ్మకాలు కామన్: మంత్రి గంగుల

BRS MLA Accident: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కాన్వాయ్ కి ప్రమాదం - రెండు వాహనాలు ధ్వంసం

BRS MLA Accident: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కాన్వాయ్ కి ప్రమాదం - రెండు వాహనాలు ధ్వంసం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌