By: ABP Desam | Updated at : 31 Jan 2023 12:40 PM (IST)
ప్రమాదానికి గురైన స్కూలు బస్సు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సును కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. సిరిసిల్ల వచ్చే దారిలో వెనక నుండి ఢీకొనగా 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. రెండు ఒకే వైపు నుండి వస్తున్నాయని, ఆర్టీసీ బస్ డ్రైవర్ స్కూల్ బస్సును ఢీకొనడంతోనే పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డ పిల్లలను హుటాహుటిన అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగంతో ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి స్కూలు బస్సును ఢీ కొట్టిందని సంఘటన స్థలంలో ఉన్న స్థానిక వ్యక్తులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని పిల్లలకు గాయాలు అయ్యాయి. ఆ దెబ్బలకు తట్టుకోలేక వారు బావురుమన్నారు. ముఖం, యూనిఫాంపై రక్తపు మరకలు కనిపించాయి. పిల్లలు ఏడుస్తున్న ఫోటోలు దయనీయంగా ఉన్నాయి. ఓ విద్యార్థి తన తోటి విద్యార్థికి అయిన గాయాలను చూపుతూ చేసిన రోదన అక్కడున్న వారిని కలచివేసింది.
ప్రమాదం ధాటికి స్కూలు బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి. ఆ గాజు పెంకుల వల్లే విద్యార్థులకు కాస్త గాయాలు అయినట్లుగా భావిస్తున్నారు. పెద్ద గాయాలు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
విద్యార్థుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ఆరా
రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్ ద్వారా మంత్రి కేటీఆర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే విద్యార్థులను హైదరాబాద్ కి తరలించి వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్టీసీ ఎస్ఐ పీటీవో టెక్నికల్ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!
TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్టికెట్లు అందుబాటులో!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!