By: ABP Desam | Updated at : 20 May 2023 07:48 PM (IST)
Edited By: jyothi
వర్షాకాలం పంటను నెలరోజులు ముందుకు జరపాలి: మంత్రి హరీష్ రావు ( Image Source : Harish Rao Facebook )
Minister Harish Rao: వానాకాలం పంటను నెల రోజులు ముందుకు జరిపితే.. అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టం వాటిల్లకుండా చేయొచ్చని మంత్రి హరీష్ రావు రైతులకు సూచించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేయడం వల్ల, కోతలు పూర్తి చేసి కొంత మంది నష్టం నుంచి బయట పడ్డారని అన్నారు. ఇక నుంచి రైతులు కూడా ఒక నెల ముందుగా నాట్లు వేసుకుంటే వడగళ్ల బాధ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. భవిష్యత్తులో ఒక నెల ముందుకు సీజన్ తెచ్చేలా రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు సూచించారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల రైతు విలువ పెరిగిందని అన్నారు. సంక్షేమంలో అయినా, అభివృద్ధిలో అయినా సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం భాషాయిగూడెం-తిమ్మాయిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. గ్రామంలో ప్రతీ వీధికి సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోవడం వంటివి ఎక్కువగా జరిగేవని అన్నారు. ఈ పరిస్థితిని మార్చింది సీఎం కేసీఆర్ అని వివరించారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా ఫించన్లను ఇచ్చింది కూడా తమ ప్రభుత్వేమనన్నారు. అంతే కాకుండా రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి ిదాదాపు 28 లారీల ధాన్యం వెళ్లిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పామాయిల్ తోటలు విరివిగా సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తుందని అన్నారు. రైతులంతా ఈ అవకాసాన్ని సద్వినియోగం చేసుకుంటూ పామాయిల్ తోటల పెంపకానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాసంగిలో వరికి తెగులు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతుందుతున్నారని చెప్పుకొచ్చారు. పంట మార్పిడి వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని అన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనుము, జీలుగు, పచ్చిరొట్టె విత్తనాలు తీసుకొని సమస్యలు తగ్గించుకోవాలన్నారు.
పంట నష్టం వాటిల్లితే ఎకరాకు 10 వేలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.10 వేలు నష్ట పరిహారం అందించింది ఒక్క సీఎం కేసీఆర్ యే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. నష్టపోయిన ప్రతీ రైతను ప్రభుత్వం ఆదుకుందని.. అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరినీ తాము కలిశామన్నారు. దేశంలో ఎక్కడా రెండు, మూడు వేలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశామని హరీశ్ రావు తెలిపారు. ఒక్క తెలంగాణలోనే వేల కోట్లు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. ఒక్క సిద్దిపేటలోనే మొదటి దశలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
TSPSC: టీఎస్పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!