అన్వేషించండి

RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం

Karimnagar News | కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి నిమిషాల్లో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించడంతో ప్రమాదం తప్పింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కరీంనగర్ సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి.
  • డ్రైవర్ అప్రమత్తతతో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
  • ప్రయాణికులు దిగగానే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
  • అగ్నిప్రమాద కారణాలపై దర్యాప్తు, RTC బస్సు భద్రతపై ఆందోళనలు.

Karimnagar RTC Bus Fire Accident | కొత్తపల్లి: కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. కరీంనగర్ డిపో నుండి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి.  తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశారు. 

బస్సు నుంచి దిగిపోయిన ప్రయాణికులు.. అంతా సేఫ్
సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్, బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులను వెంటనే కిందికి దించేశారు. ప్రయాణికులందరూ బస్సులో నుంచి కిందకు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించి, వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బస్సు డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ఏపీ, తెలంగాణలో వరుస బస్సు ప్రమాదాలు..

అయితే ఇటీవల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురవుతన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుల్లో ఒక్కసారిగా పొగలు వస్తున్నాయి. ప్రయాణికులను కిందకి దించివేసిన కొంత సమయానికే బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. అయితే పగటి పూట ప్రమాదాలను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించకలుగుతున్నారు. ఒకవేళ రాత్రివేళ ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రయాణికుల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య నడిచే కొన్ని బస్సు సర్వీసుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. ఏపీలో కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం, వికారాబాద్ జిల్లాలో కంకర లోడ్ టిప్పర్ లారీ బస్సు మీద పడిన ప్రమాదాలు ఇంకా ప్రజల కళ్ల మందు కదలాడుతున్నాయి. ఓవైపు బస్సు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటే, మరోవైపు అగ్ని ప్రమాదాలు సైతం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

Also Read: Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !

Frequently Asked Questions

కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రమాదం ఏమిటి?

కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, అది ఏ డిపోకు చెందిన బస్సు?

ఈ ప్రమాదం తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలో జరిగింది. ఇది కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు.

బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు, వారందరూ సురక్షితంగా ఉన్నారా?

బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో అందరినీ కిందకు దించడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

బస్సులో మంటలు చెలరేగడానికి కారణం ఏమిటి?

బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget