News
News
X

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం, భయాందోళనలో ప్రజలు!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. వరుసగా ఆవులు, గేదెలపై దాడి చేసి వాటిని చంపుతోంది. తమను కూడా చంపుతుందేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

FOLLOW US: 
 
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చిరుత పులి సంచారం మండల గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. చీకోడు గ్రామానికి చెందిన రాజు అనే రైతు చిప్పళ్లపల్లి గ్రామ శివారులో తన పొలం వద్ద కట్టేసిన దూడ పై చిరుత పులి దాడీ చేసి హత మార్చింది. తెల్లవారు జామున రాజు తన పొలం వద్దకు వెళ్ళి చూడగా దూడ మృతి చెంది కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు లేగ దూడపై చిరుత దాడి చేయడం వల్లే అది చనిపోయినట్లు గుర్తించారు. స్థానిక ప్రాంతాల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని.. వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఒక్కరే వెళ్లకూడదని వివరించారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. 

మూడు నెలల క్రితం కూడా ఇక్కడే పులి సంచారం.

చిరుత సంచారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. పదిరోజుల వ్యవధిలోనే మరో చిరుత వరుస దాడులు చేసింది. తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో చిరుత సంచారం రైతులతో పాటు గ్రామస్తులలో కూడా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం వేణుగోపాల్పూర్‌లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత నిన్న రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి పొలిమేరల్లో ఉన్న గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది. 

రైతు తన గేదెను పొలం దగ్గర కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వెళ్ళి చూడగా అది మృత్యువాత పడి ఉంది. అక్కడి పరిసరాల్లోని కాలి అడుగుల గుర్తులను బట్టి చిరుత పులి దాడి చేసినట్లుగా స్థానికులు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామ రైతులు తమ పశువులను మొదటి నుండి పొలాలు వద్దే కట్టేసుకుంటారని, గతంలో ఎన్నడూలేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరించి, వరుస దాడులు చేస్తూ గేదెలను మరియు దూడలను చంపడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నామన్నారు.

News Reels

గుంపులు గుంపులుగా వెళ్లండి.. అటవీ శాఖ అధికారులు...

మరోవైపు ఫారెస్ట్ అధికారులు సైతం సమీప గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.. తునికాకు ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవి లోపలికి ప్రజలు వెళ్లకూడదని.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా మాత్రమే కలిసి వెళ్లాలని సూచించారు. అయితే ఇప్పటి వరకూ మనుషులపై దాడి చేయని చిరుతపులి ప్రధానంగా ఆకలి తీర్చుకోవడానికి మూగజీవాలపైన అర్ధరాత్రి వేళల్లో తరచూ దాడులు చేస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే ఇది ఒకటేనా లేదా ఈ మధ్య ఏమైనా వాటి సంఖ్య పెరిగిందా ? అనే విషయంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు

నిజానికి గుట్టలను ప్రధాన ఆవాసంగా చేసుకుని తిరుగుతున్న చిరుతపులి ఒకసారి సమీప గ్రామాలపై దాడి చేయడం మొదలుపెట్టింది అంటే ఇక తేలికగా దొరికే ఆహారం కోసం అది అలవాటు పడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్దగా ప్రతిఘటించలేని ఆవులు గేదెలు, మేకలు లాంటి జంతువులను టార్గెట్ చేసుకుంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మనుషులపై దాడి చేసే పరిస్థితి రాకముందే వెంటనే చిరుతపులిని పట్టుకోవాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వేసవి కాలం ముగిసే రోజుల్లో ఉపాధి కోసం అటవీ ఉత్పత్తుల సేకరణ  కోసం వెళ్ళే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని విన్నవించుకుంటున్నారు.

Published at : 30 Sep 2022 03:56 PM (IST) Tags: Leopard Wandering Leopard Wandering in Siricilla Rajanna Siricilla News Leopard in Siricilla Leopard in Telangana

సంబంధిత కథనాలు

Telangana Congress Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు - కలెక్టరేట్ల ముందు ధర్నాలు

Telangana Congress Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు - కలెక్టరేట్ల ముందు ధర్నాలు

Vemulawada Dharma Gundam: వేములవాడ రాజన్న ఆలయంలో ధర్మగుండం మళ్లీ ప్రారంభం!

Vemulawada Dharma Gundam: వేములవాడ రాజన్న ఆలయంలో ధర్మగుండం మళ్లీ ప్రారంభం!

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

Karimnagar News: బడుల నిర్వహణ కోసం విడుదలైన నిధులు, తీరిన ప్రధానోపాధ్యాయుల సమస్యలు!

Karimnagar News: బడుల నిర్వహణ కోసం విడుదలైన నిధులు, తీరిన ప్రధానోపాధ్యాయుల సమస్యలు!

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?