By: ABP Desam | Updated at : 05 May 2023 03:09 PM (IST)
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను ప్రకటించిన కేటీఆర్
KTR : కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీార్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నాలుగేండ్లలో ఏం చేశాడో చెప్పే దమ్మందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ ఎవరంటే చెప్పుకోవడానికి తనకు సిగ్గు అయింతుదని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్ కుమార్ ను గెలిపించి.. బండి సంజయ్ ను ఇంటికి పంపాలని సూచించారు. కేటీఆర్ ప్రకటనతో ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరు ఖరారైనట్లయింది. ప్రస్తుతం వినోద్ కుమార్ తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకే కేబినెట్ హోదా ఉంది.
తెలంగాణ ఉద్యమంలో బోయినపల్లి వినోద్ కీలక పాత్ర పోషించారు. మొదట హన్మకొండ నుంచి ఆ తర్వాత కరీంనగర్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా బండి సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఆయన చురుకుగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీ జాతీయ వ్యవహారాలను ఎక్కువగా చక్క బెడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎంపీ టిక్కెట్ ను కేటీఆర్ ఖరారు చేశారు.
హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని మోడీ.. నల్ల డబ్బు తెస్తానని చెప్పి తెల్ల మొఖం వేశాడని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలు ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను మోడీ తిట్టారని మరి ఇప్పుడు అదే గ్యాస్ సిలిండర్ రూ.1200 అయ్యిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏమీ చేయలేదని, మోడీ వలన లాభపడ్డ ఏకైక వ్యక్తి ఆదానీ మాత్రమేనని ఆరోపించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు @KTRBRS గారితో కలిసి ఈరోజు హుస్నాబాద్ లో ఇండోర్ స్టేడియం ను ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/nDJ0Oyl2xE
— B Vinod Kumar (@vinodboianpalli) May 5, 2023
75 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్టాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలని ఏ మొఖం పెట్టుకొని అడుగుతున్నారని ఆ పార్టీ నేతలను కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అంటే భారత రైతుల పార్టీ అని అన్న కేటీఆర్ .. రంగు మరీనా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తు్ందని చెప్పారు. ఈ విషయంలో రైతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి వినోద్ కుమార్ అసెంబ్లీకి పోటీ చేస్తారని కొంత మంది ప్రచారం చేస్తున్న సమయంలో కేటీఆర్.. పార్లమెంట్ కే పోటీ చేస్తారని ప్రకటించడంతో.. పార్టీ నేతలకూ క్లారిటీ వచ్చినట్లయింది.
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో ప్రవేశాలు!
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!