అన్వేషించండి

Korutla Deepthi Case: కోరుట్ల దీప్తి హత్య కేసు - చందన, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Korutla Deepthi Case: కోరుట్ల దీప్తి హత్య కేసులో ఆమె చెల్లె చందనను, చందన ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Korutla Deepthi Case: జగిత్యాల జిల్లా కోరుట్లలో టెకీ దీప్తి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మద్యం సేవించడం, ఆపై దీప్తిని హత్య చేయడం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది మంగళవారం రాత్రి దీప్తి అనుమానాస్పద మృతి వెలుగు చూడగా.. దీప్తి ఎలా చనిపోయింది, తను చనిపోవడానికి కారణం ఏంటి, ఎవరైనా హత్య చేశారా, చేస్తే వాళ్లు ఎవరూ అనే విషయాల గురించి పోలీసులు ఇప్పటికీ ఏదీ తేల్చలేకపోతున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న దీప్తి చెల్లెలు చందనను, చందన ప్రియుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చందనన, ఆమె ప్రియుడు కలిసి ఆ రాత్రి ఇంట్లో మద్యం పార్టీ అనంతరం వెళ్లిపోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి.

దీప్తి మృతి కేసులో పోస్టు మార్టమ్ రిపోర్టు కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు వైద్యులు ఇచ్చే పోస్టు మార్టం నివేదికలో మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి. దీప్తిని తాను చంపలేదని చందన తమ్ముడు సాయికి వాయిస్ మెసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కోరుట్ల బస్టాండ్ లో సీసీ కెమెరా ఫుటేజ్ చందన, ఆమె ప్రియుడిది కాదని పోలీసులు తేల్చారు. వాయిస్ మెసేజ్ పంపడంతో సాంకేతికత ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

ఇదీ జరిగింది..

ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు. వీరు 25 ఏళ్ల క్రితమే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. ఇటుక బట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాసరెడ్డి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి పుణెలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అలాగే చిన్న కూతురు చందన ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది.

సోమవారం రోజు ఉదయం శ్రీనివాస్ రెడ్డి, మాధవి హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా... దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెల్లు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి తన కూతుర్లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. రెండు మూడు సార్లు ఫోన్ చేసిన ఆయన.. ఎవరూ స్పందించకపోవడంతో భయపడిపోయారు. 

Also Read: Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్

పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తమ ఇంట్లోకి వెళ్లి చూడాలని చెప్పారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పక్కింటి మహిళ.. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది. తలుపులు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉండగా పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా... పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. అది చూసి భయపడిన మహిళ స్థానికులను పిలిచింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే దీప్తి చనిపోయినట్లు గుర్తించారు. 

ఇదే విషయాన్ని మృతురాలి తండ్రి శ్రీనివాస్ తోపాటు పోలీసులకు తెలిపారు. మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్, చిరంజీవి హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వంటగదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉన్నట్లు తెలిపారు. అయితే అక్కాచెల్లెల్లు అర్ధరాత్రి మద్యం సేవించి ఉంటారేమో అని పోలీసులు భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget