Karimnagar: కరీంనగర్‌లో వసూల్ రాణులు, రోడ్డుకు అడ్డం వచ్చి మరీ - ఇంకొందరు మరీ దారుణం!
Karimnagar News: ఎన్జీవో పేరు గాని.. ఊరు గాని, అడ్రస్ గాని లేవు. కనీసం వారు గతంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారో, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక పత్రాలు కానీ లేదా ప్రభుత్వ అనుమతి పత్రం కానీ ఏమీ లేవు.
Karimnagar News: గతంలో హైదరాబాద్ సహా ఇతర మెట్రో సిటీలకే పరిమితమైన నార్త్ ఇండియాకు చెందిన కొందరు అమ్మాయిల పబ్లిక్ డబ్బు వసూళ్ల వ్యవహారం ఇప్పుడు కరీంనగర్ (Karimnagar News) పట్టణానికి కూడా చేరింది. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ ఓ ముగ్గురు అమ్మాయిలు అందంగా ముస్తాబై పట్టణంలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని దారిన వచ్చే పోయే జనాలను ఆపడం ప్రారంభించారు. తామంతా ఒక ఎన్జీవో కోసం పని చేస్తున్నామని... సేవ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని కాబట్టి ఎంతో కొంత డబ్బు ఇవ్వండని అడ్డు పడి మరీ వేధిస్తున్నారు. అయితే ఇదే విషయం తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రశ్నించగా వారు చూపించిన కాగితం చూసి ఆశ్చర్యపోయారు.
Also Read: TSRTC Recruitment 2022: తెలంగాణలో ఆర్టీసీలో ఉద్యోగాలు- జూన్ 15లోపు దరఖాస్తు చేసుకోండి
దానిపై నిజానికి ఏలాంటి ఎన్జీవో పేరు గాని.. ఊరు గాని, అడ్రస్ గాని లేవు. కనీసం వారు గతంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారో, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక పత్రాలు కానీ లేదా ప్రభుత్వ అనుమతి పత్రం కానీ ఏమీ లేవు. కేవలం ఒక పేపర్ పై ఏదో ఒక మ్యాటర్ రాసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి బయలుదేరారు వీరు. ఇంకా ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎవరో డబ్బులు ఇచ్చినట్టుగా వారికి వారే రాసినట్టు ఆ అక్షరాలు చూస్తే సహజంగానే అర్థమైపోతుంది.
Also Read: Jagtial Crime : జగిత్యాలలో దారుణ హత్య, మద్యం మత్తులో కత్తితో దాడి!
ఈ రోజుల్లో ప్రతి ఒక్క సంస్థ తనకు సొంతంగా వెబ్ సైట్ మెయింటెన్ చేస్తూ అందులో వారి సేవా కార్యక్రమాలను సహజంగానే ఉంచుతూ ఉంది. కానీ మీరు ఎలాంటి పత్రాలు లేకుండానే ప్రజల దగ్గర మోసం చేయడానికి బయలుదేరారు. టిప్ టాప్ గా తయారై.. రోడ్డుకు అడ్డంగా వచ్చి మరీ జనాలను డబ్బుల కోసం ఆపి వేధిస్తున్నారు. అయితే గతంలో హైదరాబాద్, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం జరిగింది. కానీ ఆడపిల్లలు కదా అని అక్కడి స్థానిక పోలీసులు కూడా వీరిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు.
Also Read: Karimnagar: కరీంనగర్‌లో ఈదురుగాలుల టెన్షన్! కూలుతున్న హోర్డింగులు, చెట్లు
Also Read: Gambling At Boarder: కరీంనగర్ సరిహద్దుల్లో జోరుగా మూడు ముక్కలాట- ఆటగాళ్ల వద్దకే సౌకల సౌకర్యాలు