అన్వేషించండి

Jeevitha Rajasekhar: కేసీఆర్ ప్రభుత్వానికి కౌండౌన్ స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ తో ఎవరికి లాభం?: జీవితా రాజశేఖర్

టీఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ అమరవీరుల త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి స్వార్థ రాజకీయాల కోసమే  బిఆర్ఎస్ గా ఆవిర్భవించిందని బీజేపీ నాయకురాలు జీవిత రాజశేఖర్ అన్నారు.

Rekurthi Village in Karimnagar: తెలంగాణ ఉద్యమ సాధన కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ అమరవీరుల త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి స్వార్థ రాజకీయాల కోసమే  బిఆర్ఎస్ గా ఆవిర్భవించిందని బీజేపీ నాయకురాలు, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్ అన్నారు. టీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించనోళ్లు.. బీఆర్ఎస్ తో దేశాన్ని ఉద్ధరిస్తామనడం, అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ కు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బంధం తెగిపోయిందని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కౌండౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ హటావో.. తెలంగాణ బచావో నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని జీవిత రాజశేఖర్  పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రేకుర్తిలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ జాడి బాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు బీజేపీ నాయకురాలు, నటి జీవిత రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధనలను నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేలా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. అందులో భాగంగానే నేడు శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాలతో ప్రజల మధ్యకు వచ్చిందన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల కాలం గడిచిపోయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చి 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ మార్చారని ఆమె దుయ్యబట్టారు. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తిని వీడి అధికారమే పరమావధిగా ఇన్నేళ్ల కాలంగా జీవిస్తుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలన చేతిలో బంధీ అయిందని, తెలంగాణ సమాజం కోరుకున్న  దానికంటే భిన్నంగా కేసీఆర్ సర్కార్ పాలన కొనసాగిస్తుందని జీవిత విమర్శించారు. 

నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందే వేదం శాసనం అనే విధంగా మారిందని, సామాన్యులు జీవించలేని దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, నాడు టీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ సాధించింది ఏమిటి? నేడు బిఆర్ఎస్ తో సాధించేది ఏమిటో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం అనేక సమస్యల తో సతమతమవుతుంటే పరిష్కరించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటుందని  విమర్శించారు.

జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఏ రంగం కూడా సక్రమంగా అభివృద్ధి చెందింది లేదని, సామాన్య ప్రజానీకం జీవంచలేని దయనీయపరిస్థితి కేసీఆర్ పాలనలోనే ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నాడు టీఆర్ఎస్ మాయ మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని నమ్మించి మోసం చేశారని, నేడు బీఆర్ఎస్ తో మళ్లీ ప్రజానీకాన్ని మోసం చేయడానికి కొత్త రాజకీయ నాటకం మొదలు పెట్టారని కృష్ణారెడ్డి విమర్శించారు. 

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బిజెపి శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లాలని, దేశంలోని మోడీ ప్రభుత్వ పాలను, పథకాలను, విజయాలను ప్రజలకు వివరించాలనీ, ప్రజలకు వాస్తవ విషయాలు  తెలియజేయడానికి, పై విషయాలతోఇంటింటికి బిజెపి చేరువ కావాలనే ఉద్దేశంతో శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసే వరకు బిజెపి శక్తి కేంద్ర ఇంఛార్జులు, బూత్ కమిటీ బాధ్యులు, పార్టీ శ్రేణులు విశ్రమించవద్దన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget