అన్వేషించండి

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Karimnagar News: దాదాపు 109 ఏళ్ల పాటు అనేక ప్రభుత్వాలకు తన సేవలు అందించిన కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఇరిగేషన్ బిల్డింగ్ ఆఫీస్ జిల్లాలోని అనేక ప్రాజెక్టులకు పురుడు పోసింది.

ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం
నూతన నిర్మాణాల కారణంగా పాత బిల్డింగ్ కూల్చివేత
బ్రిటీష్ హయాం నుండి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని కార్యాలయాలలాగే అదొక ప్రభుత్వ కార్యాలయం. అయితే దానికో స్పెషాలిటీ ఉంది. దాదాపు 109 ఏళ్ల పాటు అనేక ప్రభుత్వాలకు తన సేవలు అందించిన కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ ఆఫీస్ జిల్లాలోని అనేక ప్రాజెక్టులకు పురుడు పోసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా ఒక్కటే కాదు చుట్టుపక్కల ఉన్న అనేక జిల్లాలలో గత శతాబ్దంలో నిర్మించిన కొన్ని వందల ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే ప్లాన్ గీసి, అమలుచేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా! ఈ బిల్డింగ్ త్వరలో చరిత్రలో మిగిలిపోనుంది. కొత్త కార్యాలయం నిర్మించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇప్పుడు నేలమట్టం చేసింది.

మానేరు నుంచి కాళేశ్వరం వరకూ.. 
ఈ చిత్రంలో మీరు చూస్తున్న ఈ పురాతన బిల్డింగ్ కరీంనగర్ నడిబొడ్డున కలెక్టర్ నివాసానికి ఎదురుగా ఉండే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పురాతన భవనం. 1913లో ఈ బిల్డింగ్ ని నిర్మించారు. అంతే కాదు ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా తన అధికార కొలతలకు ప్రామాణికంగా నిలిచే రాయిని కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు. విశాలమైన గదులతో సహజ సిద్ధంగా ఉండే గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించిన ఈ బిల్డింగ్ అనేక మంది గొప్ప గొప్ప ఇంజినీర్లు ఊహించిన ప్రముఖ ఇంజనీరింగ్ భారీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో మాట్లాడుకుంటున్న మానేరు ప్రాజెక్టులతో పాటు ఈ మధ్య వచ్చినటువంటి కాళేశ్వరం వరకూ అనేక ప్రాజెక్టులు ఇక్కడినుండే  అమలు చేశారు.

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

చివరి ఈఈ శ్రీనివాసరావు గుప్తా మాటల్లో.. 
ఇక అధికారికంగా 1955 నుండి ఇప్పటివరకు 51 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక్కడి నుండి సేవలు అందించారు. మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా N N అయ్యంగార్ పని చేయగా ప్రస్తుతం శ్రీనివాసరావు గుప్తా ఈ బిల్డింగ్ నుంచి పనిచేసిన చివరి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ఈ బిల్డింగ్ కి సంబంధించిన చారిత్రక విషయాలు చెబుతూ.. అప్పట్లో ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా క్వార్టర్లు కూడా నిర్మించారు. అంతేకాకుండా ఒక బావి కూడా కట్టారు. అప్పట్లో నీటి అవసరాలను తీర్చడానికి ఇది ఉపయోగపడేది. అప్పుడు పట్టణానికి దూరంగా ఉండేలా కనిపించిన ఈ భవనం ఇప్పుడు సిటీ సెంటర్ లో ఉంది. అయితే  ప్రభుత్వ కార్యాలయాలకు మరింత మెరుగైన సౌకర్యాల దృష్ట్యా దీన్ని కూల్చివేయాలని అధికారులు సూచించడంతో దీనికి సమయం దగ్గర పడింది. ఆనవాళ్ళు ఏమీ లేకుండా దీన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎన్నో ప్రాజెక్టుల కలలను నెరవేర్చిన ఈ బిల్డింగ్ ఇక తెరమరుగైందన్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు గుప్తా.

Also Read: KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా 

Also Read: Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

టాప్ హెడ్ లైన్స్

Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
Embed widget