By: ABP Desam | Updated at : 23 Mar 2022 07:38 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ప్రైవేటు ఆస్పత్రుల్లో చేసే సిజేరియన్ ఆపరేషన్ లలో గతంలో కరీంనగర్ దేశంలోనే మొదటి స్థానంలోనే ఉండేది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల కంటే ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగే సిజేరియన్ ఆపరేషన్లు పదుల రెట్లలో ఎక్కువగా ఉండేవి. అప్పట్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఆపరేషన్లపై, ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందంటూ ప్రజా సంఘాలు, ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమించడంతో క్రమక్రమంగా అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే సిజేరియన్ ఆపరేషన్లు కూడా తగ్గాయి. కానీ మళ్లీ వ్యవహారం మొదటికి వస్తోంది.
KCR కిట్ ప్రభావం
గతంలో కరీంనగర్ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ 2017 జూన్ 3న కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభించారు. దీని ద్వారా గర్భిణులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు తల్లీ బిడ్డకు కావలసిన అనేక వస్తువులను సైతం ఉచితంగా అందించడం మొదలు పెట్టారు. దీంతో ప్రభుత్వం ఆసుపత్రిలో డెలివరీలో పెరిగాయి. సగటున ఒక డెలివరీకి ప్రైవేటు హాస్పిటల్ లో 40 వేలు ఖర్చు అవుతుంది. పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది నిజంగా భారమైన విషయమే. మాతా శిశు సంరక్షణకు తమిళనాడులో ముత్తులక్ష్మి రెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీం కింద 12 వేల సాయం అందిస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసిన తెలంగాణ అధికారులు ఇక్కడ కూడా అదే పథకాన్ని కొన్ని మార్పులు చేర్పులతో కలిపి 16 వస్తువులతో కూడిన కిట్ లను అందజేస్తూ ఆర్థిక సాయం కూడా ఇస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల 80 వేల 79 కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అందులోనూ కరీంనగర్ లో పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రిలోని సౌకర్యాల మూలంగా అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రజలు క్యూ కట్టారు.
మళ్ళీ ఏమైంది?
అటు ప్రభుత్వ ఆసుపత్రిలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉన్న పి.హెచ్.సి (ప్రైమరీ హెల్త్ సెంటర్) లో సగటున నెలకు 20 డెలివరీ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడం స్టాఫ్ నర్సులు నార్మల్ డెలివరీ లు చేస్తూ ఉండడంతో రూరల్ ఏరియాతో బాటు గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చేలా అయింది.
మూడేళ్ల కిందట నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కేటాయించిన ఫండ్స్ ప్రకారం ఒక లక్ష నుండి రెండు లక్షల వరకూ నిధులను ఒక్కో సెంటర్ కి అందించారు. ఇక డిప్యుటేషన్‌పై డాక్టర్లు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోవడంతో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీలో నెలకు 20 చొప్పున సాధారణ కాన్పులు చేయాల్సి ఉండగా కరీంనగర్ జిల్లాలోని పీహెచ్‌సీలో 2021లో 51 నార్మల్ డెలివరీలు మాత్రమే చేశారు. ఐదుగురికి సిజేరియన్ చేశారు. వీటిలో ఎక్కువగా చొప్పదండిలో 25, వెల్దిలో 5, గుండిలో 10, గంగాధరలో 9 చల్లూరులో 1 , వావిలాలలో రెండు చొప్పున డెలివరీలు జరిగాయి.
ఇక జగిత్యాలలో 17 పీహెచ్‌సీలకు గానూ 15 సెంటర్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. గత సంవత్సరంలో మొత్తం 185 ప్రసవాలు చేశారు. పెద్దపల్లిలోని 16 పీహెచ్‌సీల్లో 110 డెలివరీలు చేశారు.
మళ్లీ విజృంభిస్తున్న ఆర్ఎంపీ మాఫియా
గతంలో సిజేరియన్ ఆపరేషన్ ల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులతో కుమ్మక్కైన ఆర్ఎంపీ మాఫియా అమాయక గ్రామీణ ప్రాంత ప్రజలను సిజేరియన్ల వైపు ప్రోత్సహించేది. తమ కమీషన్ల కోసం అవసరం ఉన్నా లేకున్నా గర్భిణీ లను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించేది. ఆ తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దాదాపుగా ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్లు గణనీయంగా తగ్గాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తిరిగి ఆర్.ఎం.పి లు ప్రయత్నిస్తున్నారు. దీనికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం గతంలో లాగానే స్పెషల్ డ్రైవ్ చేపడితే పరిస్థితి మళ్లీ మొదటికి రాదు. దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ
Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ ఏమన్నారంటే?
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?