అన్వేషించండి

Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం

Telangana: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఉన్నవారి పదవీ కాలం ముగియనే లేదు అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు ఆశావహులు.

Telangana MLC Elections : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఆ స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా కోసం ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. డిసెంబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు.

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్  ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి 2025 మార్చి నెలలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తున్న నేపధ్యంలో ఇప్పటినుంచే తమ ప్రచారాలు ప్రారంభించారు. అయితే ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎన్నికలు గతంలో కంటే అధిక పోటీ ఇచ్చేందుకు అన్ని రంగాల వారు సిద్ధమవుతున్నారు. ముందస్తు కసరత్తు ప్రారంభించారు. 

పట్టభద్రుల ఎన్నికల్లో పోటీపడేందుకు ఆసక్తి...!
ప్రముఖ వ్యాపారవేత్త ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, ప్రముఖ వైద్యుడు మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి.ఎన్.రావు, కరీంనగర్ మాజీ మేయర్ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు కొలసాని సుగుణాకర్ రావు, ట్రస్మ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారాలను ప్రారంభించారు.

బీసీ వర్సెస్ ఓసి...
ప్రధాన పార్టీల విషయాలకు వస్తే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ బీజేపీ నుంచి జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుగుణాకర్‌రావుకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పార్టీ నుంచి కూడా వారికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ప్రొఫెసర్ ప్రసన్న హరి కిషోర్‌కి లేక సొంత సామాజిక వర్గానికి చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? లేదా ఇంకా వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. అయితే జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఇద్దరు బిసి సామాజిక వర్గానికి చెందిన వారు మరో ఇద్దరు ఓసి సామాజిక వర్గానికి చెందినవారు పోటీల్లో నిలవడం ఆసక్తికరంగా మారింది.

పట్టభద్రుడు ఎన్నుకునేది ఎవరిని...?
గతంలో పట్టబదుల పక్షాన నాయకులు పోరాడిన న్యాయం జరగలేదని ఒక అసంతృప్తి పట్టభద్రుల్లో నెలకొంది. అయితే ఈసారి అలా కాకుండా పట్టభద్రుల పక్షాన ఉండి తమ సమస్యలపై పోరాడే వాళ్లను ఎన్నుకోవాలని పట్టభద్రులు ఆలోచిస్తున్నారు. కానీ ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎవరికి ఓటు వేయాలి అనే ఒక ప్రశ్న ఓటర్లలో చిన్న ఆందోళన తీసుకువచ్చింది.
ప్రముఖ అపరవేత్త ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉత్కూరి నరేందర్ రెడ్డికి ఓటు వేయాల లేక మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.రావుకు గెలిపిద్దామా లేక బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణను ఎన్నుకుందామా అనే అనే సందిగ్ధంలో ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రజల్లో వ్యతిరేకత...
ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కొంతవరకు వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.రావు తన సామాజిక సేవ భావంతో ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెసర్‌గా అనుభవం కలిగిన ప్రసన్న హరికృష్ణ విద్యార్థుల్లో మంచి పేరున్న వ్యక్తిగా తెలుస్తుంది. బిఅర్ఎస్ పార్టీ నాయకుడు సర్దార్ రవీందర్ సింగ్ న్యాయవాదిగా అనుభవంతోపాటు కరీంనగర్ మేయర్‌గా అనుభవం కలిగిన వారు.

ఆసక్తికరంగా పట్టభద్రుల ఎన్నికలు...
వైద్యరంగంలో రాణిస్తున్న డాక్టర్ బి.ఎన్.రావు, న్యాయవాదిగా అనుభవం కలిగిన సర్దార్ రవీందర్ సింగ్, విద్యారంగంలో అనుభవం కలిగిన ప్రొఫెసర్ ప్రసన్న హరి కిషోర్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుంది పట్టభద్రుడి అభిమానాన్ని ఎవరు గెలుచుకుంటారనేది మాత్రం ఆసక్తిగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget