అన్వేషించండి

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా :బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మెగిలిపేట గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు.

కరెంట్ మోటార్లకు కేంద్రం మీటర్లను ఏర్పాటు చేయబోతోందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్.... రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యమన్నారు. కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలిపారు. సవాల్ చేస్తున్నా... మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని... మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా?కేసీఆర్‌కు అంటూ సవాల్ విసిరారు. 

ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మెగిలిపేట గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతికే మీటర్లు పెట్టినామన్నారు. ఆయన సంగతి చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ ‌సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశారు. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు  కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను సంక్షోభంలోకి నెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనంటూ ఆరోపణలు చేశారు. కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.

చైనా బజార్లలో వస్తువులన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్.‘‘ కేసీఆర్ చెప్పింది ఎట్లుందంటే.... మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలు... మైసూర్ నుంచే తీసుకొస్తున్నట్లుగా ఉంది. ఇరానీ చాయ్... ఇరానీ నుంచి తీసుకొస్తున్నట్లుగా ఉంది. సిగ్గుండాలే అబద్దాలాడటానికి. మోదీ ప్రభుత్వం తీసుకున్న మేకిన్ ఇండియా  కార్యక్రమం ద్వారా వేలాది పరిశ్రమలు వస్తున్నాయ్. ఆయా స్థానిక పరిశ్రమల్లో తయారైన వస్తువులనే చైనా బజార్లలో అమ్ముతున్నారు. ఆ సోయి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’’అని విమర్శించారు  బండి సంజయ్. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే ఎటుపోయారని నిలదీశారు. 250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు డబ్బులివ్వరా? అని మండిపడ్డారు. లక్షకోట్లతో దొంగ సారా దందా చేస్తారా? ఆరోపణలు చేశారు. కేసీఆర్.... మీవల్ల కాకపోతే చేతగాదని రాసివ్వండి అంటూ కామెంట్ చేశారు. కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. 

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్నహామీ ఏమైందని... గల్ఫ్ బాధితుల శవాలను కూడా తీసుకురాలేని అసమర్థులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. వేమువాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హామీ ఏమైందన్నారు. మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్నారంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. సోమన్నగుట్టకు ఘాట్ రోడ్డు వేయడం చేతగాని సీఎం అంటూ విరుచుకుపడ్డారు. బీడీ కార్మికుల బాధలెందుకు పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్లకు కటాఫ్ డేట్ ఎత్తేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివేనంటూ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget