Manthani News Today: మంథని వసతి గృహంలో నగ్న క్షుద్ర పూజలు- భయపడి పారిపోయిన బాలిక
Peddapalli News Today: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విద్యార్థినులకు మాయ మాటలు చెప్పి వారితో పూజలు చేయిస్తున్నట్టు తేలింది.
Manthani Latest News: భగవంతుని ప్రార్థిస్తే కరుణాకటాక్షాలు లభిస్తాయని, కోరుకున్న కోరికలు కొంగుబంగారమై తీరుతాయి అని తెలుసు. కానీ క్షుద్ర పూజలు నగ్నంగా చేస్తే కాసుల వర్షం కురుస్తుందట. వర్షాకాలంలో సరియైన సమయానికి వర్షాలు కురువకపోతే కప్పలకు పెళ్లిళ్లు చేస్తే వర్షాలు కురుస్తాయని ఒక నమ్మకం. అలాగే కాసులు లేని వారు కూడా నగ్నంగా పూజలు చేస్తే కాసులు వర్షం కురుస్తుందని నమ్మించి ఓ బాలికతో నగ్నంగా క్షుద్ర పూజలు చేసేందుకు యత్నించారు ఓ ఇద్దరూ ప్రబుద్ధులు...
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ హాస్టల్లో నగ్న పూజల పేరిట బాలికను ఇరికించేందుకు యత్నించారు. మహిళా వంట మనిషి నమ్మించి క్షుద్ర పూజలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ తతంగం మంథని పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపి వంట మనిషి ఈ తతంగాని తెరలేపారు. నగ్న పూజలకు సహకరించాలని చెప్పినట్లు తెలుస్తోంది. నగ్న పూజలు చేస్తేనే లక్ష్మి కటాక్షిస్తుందని నమ్మించి, వారం రోజుల క్రితం హాస్టల్ వర్కర్ కొందరు పూజలు చేసే వారిని సంప్రదించినట్లు సమాచారం.
Also Read: జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
దీంతో ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజులుగా అక్కడే ఉండిపోయంది. సోమవారం తల్లిదండ్రులు రావడంతో వారికి విషయం మొత్తం తెలిపింది. దీంతో బాలిక బంధువులు, తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకొని వంట మనిషిని నిలదీశారు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం అందడంతో మంథని పోలీసులు హాస్టల్ వద్దకు వెళ్ళి విచారణ చేపట్టారు. చదువుకునే ఆడపిల్లలతో ఇలాంటి పనులు చేయించి పక్కదారి పట్టించే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంథని పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రులు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గత కొంతకాలంగా మంథని నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లో లక్ష్మి కటాక్షం పేరుతో వేరే పనులు కూడా చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మంథనిలో గత కొన్ని రోజులుగా అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.