News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

2BHK Housing Scheme: మంత్రి హరీష్ రావు నోట - ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సామెత, అంత కష్టమా!

2BHK Housing Scheme: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో పైరవీలు జరిగే అవకాశమే లేదని.. లబ్దిదారులకు మాత్రమే ఇళ్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 

FOLLOW US: 
Share:

2BHK Housing Scheme: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఎలాంటి పైరవీలకు ఛాన్స్ లేదని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు.. లబ్ధిదారులకు తన చేతులమీదుగా గృహ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికే రాలేదని.. ఎంతో కష్టం, ప్రయాస పడితే తప్ప ఇల్లు కట్టలేమన్నారు. అలాంటి ఒక రూపాయి ఖర్చు కాకుండా, చెమట చుక్క చిందించకుండా మీకు అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. 

ఎలాంటి పైరవీలు జరగకుండా నిజంగా ఇల్లు లేని లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇల్లు అందేలా కలెక్టర్ చేతనే ఇళ్ల మంజూరు చేయించామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బోరు బావుల వద్ద మీటర్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చిందని గుర్తు చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. బావుల వద్ద మీటర్లు పెట్టనందుకు రూ.30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆపిందని వివరించారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంటు కష్టాలు పెద్ద ఎత్తున ఉండేవని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు.. పంటభూములకు సాగు నీటితో పాటు రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ అందజేస్తున్నామన్నారు. 

రైతులను ప్రేమించే నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా, పెద్ద నోట్ల రద్దు, ఎలాంటి కష్టం వచ్చినా రైతులకు కష్టం లేకుండా కన్నబిడ్డను చూసుకున్నట్లు చూసుకున్నారని వెల్లడించారు. మొదక్ నియోజక వర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించామన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్ కు వెళ్లే అవసరం లేకుండా ప్రజల వద్దకే వైద్య సేవలు తెచ్చామని వెల్లడించారు. ఈనె 14వ తేదీన న్యూట్రిషన్ కిట్ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడనుందని హరీష్ రావు స్పష్టం చేశారు. 

అలాగే వానాకాలం పంటను నెల రోజులు ముందుకు జరిపితే.. అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టం వాటిల్లకుండా చేయొచ్చని మంత్రి హరీష్ రావు రైతులకు సూచించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేయడం వల్ల, కోతలు పూర్తి చేసి కొంత మంది నష్టం నుంచి బయట పడ్డారని అన్నారు. ఇక నుంచి రైతులు కూడా ఒక నెల ముందుగా నాట్లు వేసుకుంటే వడగళ్ల బాధ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. భవిష్యత్తులో ఒక నెల ముందుకు సీజన్ తెచ్చేలా రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు సూచించారు.

Published at : 05 Jun 2023 04:04 PM (IST) Tags: Minister Harish Rao Double bed room houses Harish Rao News Telangana News Harish on CM KCR

ఇవి కూడా చూడండి

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు

Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?