News
News
X

Minister Gangula Kamalakar : ఎర్రగడ్డ ఆసుపత్రిని ఏపీకి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది, సీఎం జగన్ కు నేనే లెటర్ రాద్దామనుకున్నా- మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar : ఆంధ్రనేతల రాజకీయంపై మంత్రి గంగుల కమలాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ కు తానే స్వయంగా లెటర్ రాద్దామనుకున్నానని చెప్పారు. ఆంధ్ర నేతలను తెలంగాణ పంపుతున్నారని చమత్కరించారు.

FOLLOW US: 
 
Minister Gangula Kamalakar :  "ఆంధ్ర నేతలు తెలంగాణ మీద పడ్డారు. ఒకరు నడుస్తున్నారు, ఒకరు డ్యాన్స్ చేస్తున్నారు. నేనే సీఎం జగన్ మోహన్ రెడ్డికి లెటర్ రాద్దామనుకుంటున్నారు. అయ్యా అందరినీ ఇటు ఎందుకు పంపిస్తున్నావు. ఎర్రగడ్డ ఆసుపత్రిని ఏపీకి తరలిస్తే సరిపోతుంది కదా. ఏపీ నేతలు వచ్చి ఏం తిటుతున్నారో, ఎందుకు తిడుతున్నారో, ఎవరిని తిటుతున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణ బిడ్డలకు ప్రజాప్రతినిధులకు ఓపిక ఎక్కువ. వాళ్లను మనం అతిథులుగా చూస్తాం. రానీ తెలంగాణ పంటలను చూసుకుంటా పోతారు. రోడ్లు చూసుకుంటా పోతారు. పాదయాత్ర చేసివాళ్లను ఆహ్వానిస్తున్నాం. రోడ్డుకు ఇరువైపులా పంటలుంటాయి. మరో జలశయాలు ఉంటాయి. విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయి. తెలంగాణ అంటే అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్. అందరూ రావాలి తెలంగాణ అభివృద్ధిని చూడాలి. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో చూసుకుంటా పోతారు." - మంత్రి గంగుల కమలాకర్ 

ధాన్యం కొనుగోలు సెంటర్ల ప్రారంభం 

 కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ప్రారంభించారు. 2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఇప్పుడు కోటిన్నర  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు. పంట పండడానికి అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించిందన్నారు. గతంలో మార్కెటింగ్ చేసుకోవడంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కేంద్రం నూకలు తినాలని, మేం కొనమని ఖరాఖండిగా చెప్పినా... రైతు పండించిన ప్రతీ గింజను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.  శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొన్న ఆహార సంక్షోభం చూశామని, కనీసం దాన్ని పట్టించుకోకుండా ముందు చూపు లేకుండా రైతుల పంటలపై చిన్నచూపుతో వ్యవహరించిన తీరుతో కేవలం ఆరు నెలల్లోనే కేంద్రం వద్ద నిల్వలు కొరత ఏర్పాడ్డాయని దుయ్యబట్టారు. బాబాసాహెబ్ చెప్పిన ఆహార భద్రతను గాలికొదిలి పూర్తి వ్యాపారిలా వ్యవహరించే కేంద్రం ఉండడం దురదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ కృషితో భూమి మేయలేని విధంగా పంటను పండించామని, కానీ దీన్ని అడ్డుకునేవిధంగా ర్యాకు మూమెంట్ ఇవ్వకా, గోడోన్లు కేటాయించక, ఎఫ్.సి.ఐ వంటి సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమన్నారు.  

6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదన 

News Reels

రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదించామని, ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల్ని సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వీటికి సాధారణ రకం 2040, మేలు రకం 2060 మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తామన్నారు. నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.  గతంలో కళ్లాలు ధ్యానం ఉండి ఎప్.ఏక్యూ వచ్చేదని ఇప్పుడు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తుండడంతో అక్కడ ప్యాడీ క్లీనర్ల ద్వారా ఎఫ్.ఏ.క్యూ పాటించి ఒక్క గింజను సైతం తరుగు పెట్టే ప్రసక్తే లేదన్నారు. కానీ కొన్ని చోట్ల రైతులే స్వయంగా రెండు మూడు కిలోలు తరుగు పెట్టినా సరే ఎట్లుందో అట్ల తీసుకోవాలంటున్నారని తద్వారా మిల్లుల్లో తరుగుతీస్తున్నారని ఈసారి అలాంటి వాటికి అనుమతించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6313 మంది రైతుల దగ్గర నుండి సేకరించామని దీని విలువ దాదాపు 100 కోట్లుందన్నారు.  14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోనే రైస్ మిల్లులున్నాయని, 2300 మిల్లుల్లో నిరంతరాయంగా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Published at : 04 Nov 2022 08:51 PM (IST) Tags: TS News CM Jagan Karimnagar Minister Gangula Kamalakar AP Leaders

సంబంధిత కథనాలు

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

టాప్ స్టోరీస్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?