News
News
వీడియోలు ఆటలు
X

Bandi Sanjay : కేసీఆర్ నీ మాటలన్నీ కోతలే, రైతులకు నయాపైసా పరిహారం అందలేదు - బండి సంజయ్

Bandi Sanjay : వారంలో ఇస్తానన్న పంట నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

FOLLOW US: 
Share:

 Bandi Sanjay : "సీఎం కేసీఆర్.... ఒక్కసారైనా రైతుల వద్దకు రా. యాడ చూసినా పంట  నష్టపోయి రైతులు ఏడుస్తున్నారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయ్. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలి" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కదా అని పేర్కొన్నారు. ఆయా కేంద్రాలు తెరవకపోవడంవల్లే కోతలను చాలా మంది రైతులు నిలిపివేశారని చెప్పారు. ప్రకృతి విపత్తుల కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమయ్యాయి? వేటికి ఖర్చు చేశారో ఆ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.   కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పకీర్ పేట, చామనపల్లి, వేదురుగట్ట గ్రామాల్లో బండి సంజయ్ పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

పంట పొ
 లాల పరిశీలన 

 వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే, అప్పు చేసి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన వచ్చి మా బతుకులను నాశనం చేసిందని భోరున విలపిస్తు్న్నారన్నారు. అన్నం పెట్టే చేతులు అడుక్కునే దుస్థితికి చేరుకున్నామని వాపోయారు. "పోయినసారి పంట నష్టపోయాం... ఈసారైనా పంట వస్తే అప్పులు తీర్చాలనుకున్నాం... ఈసారి కూడా దేవుడు మా పంటను పొట్టన పెట్టుకున్నాడు.. చావే శరణ్యం’’ అంటూ పలువురు రైతులు బండి సంజయ్ ను పట్టుకుని ఏడ్చారు. వాళ్ల కన్నీళ్లను తుడిచిన బండి సంజయ్ పరిహారం అందేవరకు ప్రభుత్వంపై పోరాడతానని భరోసా ఇచ్చారు.  

నయా పైసా రైతులకు సాయం అందలేదు 

కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానతో రైతులు పూర్తిగా పంట నష్టపోయారని బండి సంజయ్ తెలిపారు. పంట పొలాలకు పోయి రైతును కదిలిస్తే దు:ఖ మొస్తోందన్నారు. ఏ రైతును చూసినా కన్నీళ్లే వస్తున్నాయన్నారు. పోయినసారి పంట నష్టపోయారు. ఈసారైనా పంట చేతికొస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుని అప్పు తీర్చాలని రైతులు తపన పడ్డారు. తీరా చూస్తే మళ్లీ వడగండ్ల వానతో పంట పూర్తిగా నష్టపోయారని ఆవేదన చెందారు.  ప్రభుత్వం నిర్ణీత సమాయానికి కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే ఇంత భారీ నష్టం జరిగేది కాదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంవల్ల రైతులు కోతలు పూర్తి చేయలేకపోయారన్నారు. గత నెలలోనే సీఎం కేసీఆర్ ఇదే జిల్లాలోని రామడుగు వచ్చి... నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తానన్నారు. ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే గత నెలలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇఛ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 288 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా రైతులకు సాయం అందలేదని ఆరోపించారు. తీరా చూస్తే 8 వేల ఎకరాలకే పంట నష్టం ఇవ్వాలని నివేదిక రెడీ చేశారట.. అయినా ఏ ఒక్కరి ఖాతాలో పైసా కూడా పడలేదన్నారు. 

కొడుకు, బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయ్ 

 "కేసీఆర్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాల్లేవు. ఇయాళ రైతులు బిచ్చమెత్తుకోవాల్నా? నీ మూర్ఖత్వ పాలనలో 4 ఏళ్లలో 70 వేల మంది రైతులు చనిపోయారు.  288 కోట్ల రూపాయల సాయం చేస్తానని చెప్పిన నిధులన్నీ కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింది కేటాయించినవే కదా. ఆ డబ్బులు రైతులకు ఇవ్వడానికి నీకున్న అభ్యంతరమేంది? మళ్లీ ఈసారి కూడా రైతులు వడగండ్ల వానకు నష్టపోయారు. ఈసారి 24 వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఈ జిల్లాలోనే ఇట్లయితే రైతులు కోలుకునేదెలా? అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వనట్లుంది నీ పాలన. 8 ఏళ్లలో నష్టపోయిన ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నవా? ఈడ కోతలు కోస్తివి... పారిపోతివి. పంజాబ్ పోయి రైతులకు చెక్కులిస్తివి..అవి కూడా చెల్లకపాయే. నీ కొడుకు, బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయి. మీరు దోచుకున్న సొమ్ములో ఒక్క శాతం ఇస్తే రైతులకు పూర్తి సాయం అందుతుంది- బండి సంజయ్ 

 

Published at : 24 Apr 2023 03:58 PM (IST) Tags: Bandi Sanjay CM KCR Karimnagar Rains Crop Damage

సంబంధిత కథనాలు

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం

Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?