News
News
X

Monkeypox : కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం, శాంపిల్స్ పరీక్షలకు పంపిన వైద్యులు!

Monkeypox : కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు వైద్యులు. అతడి శాంపిల్స్ సేకరించి నిర్థారణ పరీక్షలకు పంపారు.

FOLLOW US: 

Monkeypox : ప్రపంచాన్ని కలవరం పెడుతోన్న మంకీపాక్స్ భారత్‌ లో విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆదివారం దిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. అయితే తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలకలం రేగింది.  ఇంద్రానగర్ కాలనీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నెలలో కువైట్ నుంచి బాధితుడు వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మంకీపాక్స్‌గా అనుమానించి బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో వ్యక్తి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు. ఇటీవల విజయవాడలో కూడా మంకీపాక్స్ కలకలం రేగింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. బాలిక శాంపిల్స్ ను పుణె వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

దేశంలో నాలుగు కేసులు 

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దిల్లీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. దేశంలో గతంలో మంకీపాక్స్‌ బారిన పడిన ముగ్గురూ కేరళకు చెందినవారే. వీళ్లు సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అయితే దిల్లీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తికి ఎలాంటి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేదు.

లక్షణాలు ఎలా ఉంటాయి?

మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమ దేశాల్లో, మధ్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. చికెన్ పాక్స్‌ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది.

1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట

Published at : 24 Jul 2022 07:37 PM (IST) Tags: Hyderabad TS News Pune Kamareddy News Monkeypox samples

సంబంధిత కథనాలు

Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

KTR On MODI :  పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

టాప్ స్టోరీస్

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్