(Source: ECI/ABP News/ABP Majha)
Kavitha Counters Rahul: తెలుగులో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ - వెంటనే కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
Kalvakuntla Kavitha on Rahul Gandhi: రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేసిన కాసేపటికే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
తెలంగాణలో ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు అంశం హాట్ టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లో పంట చేతికి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి పంటను అపరిమితంగా కొనే ప్రసక్తే లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని తేల్చి చెప్పారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు కేంద్రాన్ని సమర్థించుకుంటుండగా, కాంగ్రెస్ కూడా ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు అనుకూలంగా మద్దతునిస్తూ ట్వీట్ చేశారు. అదీ తెలుగులో. తెలంగాణలో పంట కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీలు బాధ్యత విస్మరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు. ‘‘వరి పంట కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి.. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది’’ అంటూ రాహుల్ తెలుగులో ట్వీట్ చేశారు.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
అయితే, రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేసిన కాసేపటికే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ట్వీట్లు చేయడం కాదని, పార్లమెంటులో తమకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హరియాణాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
.@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్‌లో సంఘీభావం తెలుపడం కాదు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe
తమ నిరసన తెలియజేస్తున్నారు..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి..
ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి.. 2/2#TelanganaWithKCR