అన్వేషించండి

World Travel Market: లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Telangana News | ప్ర‌పంచ ప‌ర్యాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో తెలంగాణ మెరిసింది. రాష్ట్రానికి చెందిన ప‌ర్యాట‌క ప్రాంతాలు, చారిత్ర‌క‌ ప్ర‌దేశాలను లండన్ వేదికగా ప్రదర్శించారు.

World Travel Market launches in London | లండ‌న్ వేదిక‌గా ప్ర‌పంచ ప‌ర్యాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో తెలంగాణ ప్రభుత్వం మెరిసింది. సాంకేతిక ప‌రిజ్ఞానం - ప‌ర్యాట‌క రంగానికి మేలు చేసే అవ‌కాశాలు (Emerging Technology’s Potential for Good in Tourism is this year’s theme) థీమ్ తో లండ‌న్ వేదిక‌గా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్ ని పర్యాటక సంస్థ అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలసి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేలా తెలంగాణ ప‌ర్యాట‌క ప్రాంతాలు, చారిత్ర‌క‌ ప్ర‌దేశాల ఫొటోలను డిజిటల్ స్క్రీన్ లో ప‌ర్యాట‌క శాఖ ప్ర‌ద‌ర్శించింది.

తెలంగాణ పర్యాటక స్టాల్ ను సందర్శించిన ప్రముఖులు

తెలంగాణ పర్యాటక స్టాల్ ను యూకే(UK) లో భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా, తదితరులు సందర్శించారు. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఏవీ (AV)ని వీక్షించారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా ‌పలు దేశాల ప్రతినిధులు, కేంద్ర, ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ అధికారులతో జూప‌ల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ ఆల్యూర్ రెహమాన్ తో మంత్రి జూపల్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

పర్యాటకశాఖ అభివృద్ధిలో భాగంగా విదేశీ పెట్టుబడులు, హైదరాబాద్ (Hyderabad) లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్ ఏర్పాటు, లండన్ ఐ తరహాలో  హైదరాబాద్ లో జాయింట్ వీల్ ఏర్పాటు, తదితర అంశాల గురించి చర్చించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం  రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను, తెలంగాణ పర్యాటక ప్రదేశాల గురించి వారికి వివరించారు. 

ప‌ర్యాట‌క రంగ‌ంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప‌ర్యాట‌క రంగ‌ంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని అన్నారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌తో ముందుకెళ్లుతున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. అనంతరం ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకే లో భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. లండ‌న్ లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జ‌రుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) లో ప్రపంచ వ్యాప్తంగా 125 దేశాలు, భార‌త్ నుంచి 10 పైగా రాష్ట్రాలు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటున్నాయి.

Also Read: Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget