Pavan On Protests : అగ్నిపథ్ అల్లర్లు దురదృష్టకరం - సంయమనం పాటించాలని పవన్ పిలుపు !
సికింద్రాబాద్ రైల్వే ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే అగ్నిపథ్ స్కీమ్‌పై తన అభిప్రాయాన్ని చెప్పలేదు.
Pavan On Protests : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు చెలరేగడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆందోళనకారులపై కాల్పులు జరపడం.. ఒకరు చనిపోవడంపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందింారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5cl09qWOGu
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2022
హైదరాబాద్‌లో హై అలెర్ట్ - మెట్రో రైలు సర్వీసులు నిలిపివేసిన అధికారులు
అగ్నిపథ్ పథకంపై తన అభిప్రాయం ఏమిటో చెప్పని పవన్
అయితే అగ్నిపథ్ పథకంపై తన అభిప్రాయం ఏమిటో పవన్ కల్యాణ్ వ్యక్తం చేయలేదు. అగ్నిపథ్ పథకం అన్నీ ఆలోచించే తెచ్చామని ఆర్మీలో చేరాలనుకునేవారు ఖచ్చితంగా నాలుగేళ్ల అగ్నివీరులుగా ఉండాలని కేంద్రం చెబుతోంది. పాత పద్దతిలోనే ఆర్మీ నియామకాలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్మీ ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ అగ్నిపథ్ స్కీమ్ ఆగ్రహం తెప్పించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వారు దాడులు, ధర్నాలు నిరసనలకు దిగుతున్నారు. రైల్వే స్టేషన్లనను టార్గెట్ చేసుకోవడంతో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంటోంది. పదుల సంఖ్యలో రైళ్లను తగులబెట్టారు.
అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు
ముందుకే వెళ్తామంటున్న బీజేపీ
ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెబుతోంది. అయితే విపక్ష పార్టీలు మాత్రం ఈ అగ్నిపథ్ దేశ ఆర్మీ బలాన్ని నిర్వీర్యం చేస్తుందని.. అలాగే యువతనూ నాలుగేళ్ల తర్వాత ఉపాధి లేకుండా చేస్తుందని ఇలా చేయడం దేశానికి నష్టం చేసినట్లు అవుతుందని వాదిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూండగా కొన్ని పార్టీలు సైలెంట్‌గా ఉంటున్నాయి.
అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది
అగ్నిపథ్ పథకం వద్దంటున్న విపక్షాలు
ఆర్మీ లో చేరాలనుకునే ఆశావహులు ఎక్కువగా ఉన్న చోటనే నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు రైల్వే స్టేషన్ల వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆందోళన విరమించాలని అగ్నిపథ్ వల్ల ఎవరికీ నష్టం జరగదని హామీ ఇస్తున్నారు. కానీ యువత మాత్రం ఆవేశం తగ్గించుకోవడం లేదు.