అన్వేషించండి

Eetala Lands Distribution : ఈటలకు కేసీఆర్ సర్కార్ షాక్ - ఆ భూములన్నీ దళితులకు పంపిణీ !

ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ భూముల్ని తిరిగి దళితులకు పంపిణీ చేశారు. అసైన్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారని అధికారులు నివేదిక ఇవ్వడంతో ఈ చర్య తీసుకున్నారు.


Eetala Lands Distribution :  కేసీఆర్ కుటుంబానికి చెందిన జమూనా హ్యాచరీస్ అదీనంలో ఉన్న భూములను దళితులకు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో  ఈ భూములు ున్నాయి.  జమున హేచరీస్ సంస్థ దళితుల నుండి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిందని గతంలోనే జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. దీంతో  భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ క్రమంలోనే జమున హేచరీస్ భూములను అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు పంపిణీ చేసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 

బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి! టీఆర్ఎస్ మాజీ ఎంపీతో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ భేటీ?

దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారని ఈటల కుటుంబంపై ఆరోపణలు

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట లో జమునా హేచరీస్ భారీ పౌల్ట్రీ ఫాంలను నిర్మించింది. ఇందు కోసం అక్కడ పెద్ద ఎత్తున భూములును కొనుగోలు చేశారు. అయితే ఆ భూములు దళితుల నుండి భూములను కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ భూములు లాక్కున్నారంటూ అక్కడి రైతులు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడంతో ఆయన విచారణకుాదేశించారు. విచారణలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని అధికారులు నిర్ధారించారు.  ఈటల రాజేందర్ పై అక్రమంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ కేసు నమోదైంది. మొత్తం 56మంది రైతులకు సంబంధించి మొత్తం 70.33 ఎకరాల భూమి పంచినట్లుగా తెలుస్తోంది.  

హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రగడ! ‘సాలు మోదీ, సంపకు మోదీ’ అంటూ పోటాపోటీగా ఏర్పాట్లు

విచారణలో నిజమేనని అధికారులు తేల్చడంతో ఈటల బర్తరఫ్ 

ఇదే వ్యవహారంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి  బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్  బిజెపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి హుజూరాబాద్ నుంచి మరోసారి గెలిచారు. పెద్దగా హడావుడి లేకుండా భూముల పంపిణీ పూర్తి చేయడంతో ఈటల వర్గీయులుకూడా షాక్‌కు గురయ్యారు.

మళ్లీ పాత లబ్దిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వం  

వాస్తవానికి అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు,అమ్మకాలు జరగకూడదు. అయితే ఈటల రాజేందర్ అప్పట్లో ప్రభుత్వ అనుమతి తీసుకునే కొనుగోలు చేశామని వాదించారు. అయితే ప్రభుత్వం మాత్రం విచారణ జరిపి భూముల్ని మళ్లీ దళితులకు పంచేసింది. దీనిపై ఈటల రాజేందర్... జమునా హ్యాచరీస్ యజమాని అయిన ఆయన భార్య ఈటల జమున స్పందించాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget