By: ABP Desam | Updated at : 29 Jun 2022 02:03 PM (IST)
కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
తెలంగాణలో మరో రెండ్రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరి పాలనపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ హైదరాబాద్ లో భారీ ఎత్తున ఫ్లెక్లీలు పెట్టారు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫ్లెక్సీలపై ‘సాలు దొర’, ‘సంపకు దొర’ అంటూ స్లోగన్లు రాశారు. ఇది సహించని ప్రత్యర్తి పార్టీ లీడర్లు ఆ ఫ్లెక్సీలకు పోటీగా కటౌట్లను పెట్టారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లను కవర్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. దానికి దీటుగా ‘సాలు దొర - సంపకు దొర’ అంటూ నిన్న బీజేపీ నేతలు కేసీఆర్ ను విమర్శిస్తూ హోర్డింగ్స్ పెట్టారు. దీనికి టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ‘సాలు మోదీ - సంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ నేతలు హోర్డింగ్‌లు పెట్టారు. ఈ భారీ ఫ్లెక్సీలపై ప్రశ్నలు సంధించారు. బాయ్ బాయ్ మోదీ అంటూ హ్యాష్ ట్యాగ్ ని కూడా పెట్టారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరై ఇక్కడే రెండు రోజులు బస చేయనున్న వేళ పోటాపోటీగా పెట్టిన ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.
మోదీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ప్రధాని సభ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలోని పరేడ్ గ్రౌండ్ చుట్టూ బై బై మోదీ పోస్టర్లు పెట్టారు. ఆ పోస్టర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దానిని తొలగించారు.
ఫ్లెక్సీల విషయంలో పై చేయి సాధించేందుకు ఈ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలతో టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నాలకు భంగం కలిగించేలా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది. ముఖ్యంగా నగరంలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ పై ఉండే లాలీపాప్స్ అన్నింటిని అధికార పార్టీ ముందే ఆధీనంలోకి తీసుకుంది. పరేడ్ గ్రౌండ్‌లోకి వీఐపీలు వెళ్లే గేట్ వద్ద, బస్సు షెల్టర్స్‌కు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వెళ్లే ప్రధాన గేటు దగ్గర కూడా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
క్షమాపణలు చెబితే సరిపోదు రేవంత్- శాంతించని కోమటి రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణలు
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ
Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?
Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్
Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..