By: ABP Desam | Updated at : 27 Apr 2023 07:37 PM (IST)
జగ్గారెడ్డి వరుస లేఖలు - పార్టీ మారతానని సంకేతాలిస్తున్నారా ?
jaggareddy : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు వరుసగా లేఖలు రాస్తున్నారు. రెండు రోజుల పాటు వరుసగా రెండు లేఖలురాశారు. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని, పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి పేర్లు తీసుకోదల్చుకోలేదని వెల్లడించారు. ఇది మీడియా కి చెప్పడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పారీ నాయకులకు ,కార్యకర్తలకు , అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే నా ఆవేదన తెలియచేశానని లేఖలో చెప్పుకొచ్చారు.
బుధువారం కూడా ఓ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గతంలోలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరవైందని పేర్కొన్నారు. తన మనసులో ఎన్నో ఆవేదనలు మసులుతున్నాయని, కానీ వాటిని చెబితే ఏమవుతుంది… చెప్పకుంటే ఏమవుతుందో అనే ఆందోళన ఉందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ ఇష్టం తోనే ఇంకా పార్టీలో కొనసాగుతున్నానన్నారు. గతంలో కూడా పలుమార్లు రేవంత్ టార్గెట్ గా జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సర్ది చెప్పడంతో..తాను ఏం మాట్లాడనని చెప్పారు. కానీ తాజాగా మరోసారి ఆయన బయటకొచ్చి..గాంధీ భవన్ లో ప్రశాంతత లేకుండా పోయిందని విమర్శలుచేశారు.
గాంధీ కుటుంబం త్యాగాలు అంటే తనకు ఇష్టమని, ఆ పిచ్చితోనే కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులు నుంచి పార్టీలో అనేక మార్పులు వస్తున్నాయని, పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నానని, కానీ కొందరు అడ్డుపడుతున్నారని, బయటక చెప్తే ఏం అవుతుందో అని లోలోపల బాధపడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డిపై ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న బీఆర్ఎస్ కోవర్టు అనికొంత మంది నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూంటారు. ఆయన దీనిపై చాలా సార్లు మండిపడ్డారు.తనను కోవర్టు అంటే ఊరుకునేది లేదనేవారు. ఆయన నేరుగా రేవంత్ తో ఢీ కొడుతున్నారు. చాలా సార్లు రేవంత్ కు వ్యతిరేకంగా లేఖలు రాశారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావును కూడా కలిశారు. చప్పింది చేశారని ముఖ్యమంత్రిపై పొగడ్తలు కూడా కురిపించారు. అప్పట్నుంచే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పెద్దగా కనిపించడం లేదు. రేవంత్ తో ప్రతీ సారి రాజీ చేసుకున్నట్లుగా ఉంటారు కానీ మళ్లీ రెబల్ గా మాట్లాడుతూ ఉంటారు. దీంతో ఆయన అటు కాంగ్రెస్ కు ..ఇటు ఇతర పార్టీలకు కాకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. అయితే పార్టీ మారడానికి ముహుర్తం ఖరారు చేసుకునే ఇప్పుడు వరుసగా లేఖలు రాస్తున్నారని ఆయన వర్గీయులు భావిస్తున్నరు.
KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !
Top 5 Headlines Today: బీజేపీలో ఉండలేమంటున్న నేతలు, మరికొంత సమయం కావాలంటున్న వైసీపీ
Hyderabad News: హైదరాబాద్లోని ఓ పబ్ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు - యజమాని అరెస్టు
Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్! యూనివర్సిటీ టెన్నిస్లో వరుసగా మూడోసారి ఫైనల్కు!
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ