అన్వేషించండి

Jaggareddy Meets KCR : సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ - కీలక నిర్ణయం దిశగా అడుగులు ?

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల కోసం కలిశానని ఎమ్మెల్యే ప్రకటించారు.

 

Jaggareddy Meets KCR :    తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఈ మీటింగ్ జరిగింది. సంగారెడ్డి వరకూ మెట్రోను పొడిగించాలని విజ్ఞప్తి చేసేందుకు... సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై విజ్ఞాపనులు చేసేందుకు సీఎంను కలిశానని.. జగ్గారెడ్డి చెబుతున్నారు. తానేమీ చీకట్లో కేసీఆర్ ను కలవలేదని చెబుతున్నారు. అభివృద్ధి  పనుల కోసం ఎంపీలు  ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పు లేనిది ఎమ్మెల్యేగా తాను సీఎంను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం తన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారని.. మరోసారి కలవాలని సూచించారని జగ్గారెడ్డి చెబుతున్నారు. 

జగ్గారెడ్డి సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తానని చాలా సార్లు ప్రకటించారు. ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నించారు. కానీ ఎప్పుడూ అవకాశం చిక్కలేదు. ఇటీవల కాలంలో ఆయన కేసీఆర్ పై విమర్శలు కూడా చేయడం లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి  హరీష్ రావుపై మాత్రం విమర్శలు చేస్తూంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సీఎం కలుస్తానని చాలా సార్లు చెప్పారు. అయితే జగ్గారెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని రెండేళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తూండటంతో ఆయనపై కోవర్ట్ అనే ముద్ర వేశారు. దీనపైనా జగ్గారెడ్డి ఫైరయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయులు ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసమ్మతి నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ కారణంగా జగ్గారెడ్డి ఏం చేసినా.. సంచలనంగా మారుతోంది. జగ్గారెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది టీఆర్ఎస్ పార్టీ నుంచే. తర్వాత ఆయన పార్టీతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ టైంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఓ సారి బీజేపీలో చేరినా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. 

కాంగ్రెస్‌లో ఆయన ఇమడలేకపోతున్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనను ఆహ్వానించే పార్టీ లేదు. బీజేపీలో చేరలేరు. బీఆర్ఎస్‌లో చేరేందుకు స్థానిక నేతలు అడ్డం పడతారు. ఇలాంటి పరిణామాలతో  జగ్గారెడ్డికి  పార్టీ మారే చాన్స్ లేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కేసీఆర్‌తో సమావేశం కావడం.. అందులో తప్పేముందని సమర్థించుకోవడంతో ఆయనపై మరోసారి గుసగుసలు ప్రారంభమయ్యే అవకాశంఉంది. 

అయితే  జగ్గారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి  అమిత్ షా, మోదీలతో పలుమార్లు సమావేశం అయ్యారు. అది తప్పు కానీ సీఎంగా ఉన్న కేసీఆర్ కలవడం తప్పేమిటన్న లాజిక్ ను ఆయన వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో లైన్ క్లియర్ అయితే.. సంగారెడ్డి టిక్కెట్ ను కేసీఆర్ ఆఫర్ చేస్తే జగ్గారెడ్డి పార్టీ మారిపోవచ్చన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  

 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget