అన్వేషించండి

Why Only Target Harish Rao: కేటీఆర్ మంచోడే కానీ హరీష్ రావే కుట్రదారుడు - కవిత ఎందుకు రూటు మార్చారు ?

BRS party : బీఆర్ఎస్ పార్టీలో వ్యూహాత్మకంగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్‌పై తాజాగా ఎలాంటి ఆరోపణలు చేయని కవిత పూర్తిగా హరీష్ రాను టార్గెట్ చేశారు.

Harish Rao target BRS party: భారత రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేసినందున కవితపై సస్పెన్షన్ వేటు వేశారు.  దాంతో కవిత మరింతగా హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేశారు. ఇప్పటి వరకూ కవిత అంశంపై కేసీఆర్ లేదా కేటీఆర్ స్పందించలేదు. కవిత కూడా వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా హరీష్ రావు.. కేసీఆర్, కేటీఆర్ పై కుట్ర చేయవచ్చని అంటున్నారు. అంటే..కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే..కానీ ఆ ఫ్యామిలీలో హరీష్ రావు , సంతోష్ రావు లేరు.

హరీష్ రావుపై ఇక నుంచి పార్టీలో అనుమానాలు ఖాయం! 

హరీష్ రావు  బీఆఎస్ పార్టీలో కీలకం. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ  పెట్టక ముందు నుంచి ఆయన వెంటనే ఉన్నారు. సహజంగానే ఆయనకు పార్టీపై పట్టు ఉంటుంది. నిజానికి హరీష్ రావుపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు లేవు. ఇతర పార్టీల నేతలు కూడా ఆయనపై  తీవ్రమైన ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు.  ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని ఎవరూ ఆరోపణలు చేయలేదు. గత రెండు, మూడేళ్లలో ఆయన భార్య ఓ పాలడైరీని ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు.అంతకు మించి హరీష్ బిజినెస్‌లపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు లక్ష కోట్ల కాళేశ్వరం అవినీతికే హరీష్ దే కీలక పాత్ర అని కవిత ఉంటున్నారు. 

హఠాత్తుగా కేటీఆర్ పై సాఫ్ట్ కార్నర్

కవిత హఠాత్తుగా కేటీఆర్‌పై సాఫ్ట్ కార్నర్ చూపించారు. నిన్నామొన్నటి వరకూ కేటీఆర్ పై కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పార్టీ నడపడం చేత కాదన్నారు. కానీ ఇవాళ రామన్న..రామన్న అభిమానం చూఫారు .మాట్లాడి 103 రోజులు అయిందని  అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లతో తనది రక్త సంబంధమని రాజకీయాలతో సంబందం లేనిదన్నారు. కేసీఆర్, కవిత కూడా ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అందుకే .. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని చెబుతున్నారు. 

సంతోష్ రావు అవినీతిపై బయట పెట్టాలనుకున్నారా ?

సంతోష్ రావు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉంది. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొంత కాలం.. ప్రగతి భవన్ కు ఆయన వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు కవిత చాలా పెద్ద ఆరోపణలు చేశారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపడుతున్నారని అంటున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ వ్యవహారం కూడా సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

హరీష్ రావును కేసీఆర్ ఒక్కో సారి దూరం పెడుతూంటారు. రెండో సారి గెలిచిన తర్వాత చాలా కాలం మంత్రి పదవి ఇవ్వలేదు. పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ఈటలను పార్టీ నుంచి పంపేసిన తర్వాతనే ఆయనకు ప్రాధాన్యం పెరిగింది.  కారణం ఏదైనా హరీష్ రావు ఇప్పటి వరకూ పార్టీకి కానీ..కేసీఆర్, కేటీఆర్ కు కానీ వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హరీష్ పై పెరుగుతున్న విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.    

 

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget