అన్వేషించండి

Telangana Politics: నేడు మున్సిపల్ ఛైర్మన్, మేయర్ ఎన్నిక.. కీలకంగా ఎక్స్ అఫీషియో ఓట్లు

Municipal Mayor Election | రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లను, డిప్యూటీ మేయర్లను, అలాగే 116 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్శన్లు, వైస్‌ ఛైర్మెన్లను ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికల ప్రక్రియతో ఎన్నుకుంటారు.

Telangana Municipal Chairman Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లు, 116 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్సన్లను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 16న (నేడు) రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎక్స్ అఫీషియో, కో ఆప్షన్ ఓట్లు కీలకం కానున్నాయి.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం సమావేశ మందిరంలో జరిగే ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరించాలని నిబంధన విధించారు. కలెక్టర్ల అనుమతి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) కూడా చేయనున్నారు. ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ఎటువంటి ప్రయత్నాలను హాల్ లోపల అనుమతించబోరు. వేదికపై కేవలం ఎన్నికల అధికారి, పరిశీలకుడు మాత్రమే ఉంటారు.

ముఖ్యంగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఎక్స్-అఫీషియో సభ్యుల కోసం ప్రత్యేక సీటింగ్ కేటాయించారు. రాజకీయ పార్టీల సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులకు విడివిడిగా సీట్లు కేటాయించి, ప్రతి గ్రూపు ముందు గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేశారు. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కీలక ఎన్నికలను పూర్తి చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

లోక్ సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు: సంబంధిత మున్సిపాలిటీ పరిధి పూర్తిగా లేదా కొంత భాగంగా అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండాలి. అప్పుడే ఎక్స్‌ అఫీషియో ఓటు వేయవచ్చు. అయితే సంబంధిత నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉంటేనే ఓటు వేసే వీలుంటుంది. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఓటింగ్ ఉంటే ఒకేచోట మాత్రమే ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. రెండుచోట్ల కో ఆప్షన్ ఓటు వినియోగించుకునే అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు అయి ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ హవా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఏకపక్ష విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితం కాగా, 38 పురపాలికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 'హంగ్' ఏర్పడింది. 

ఇక 7 కార్పొరేషన్ల విషయానికొస్తే.. 4 కాంగ్రెస్‌కు, 2 బీజేపీకి దక్కాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం విశేషం. వార్డుల వారీగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 1,347 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా నిలిచింది. డివిజన్ల స్థాయిలోనూ కాంగ్రెస్ 191 చోట్ల గెలిచి అగ్రస్థానంలో నిలవగా, బీజేపీ 77 డివిజన్లతో రెండో స్థానంలో నిలిచింది.

మున్సిపల్ ఎన్నికల తుది బలాబలాలు
1. వార్డుల వారీగా ఫలితాలు:
కాంగ్రెస్ 1,347 
బీఆర్ఎస్ (BRS)  716 
బీజేపీ (BJP) 261 
ఇతరులు (MIM, CPI, CPM, Ind) 257 

2. డివిజన్ల వారీగా ఫలితాలు (మొత్తం 414):
 కాంగ్రెస్ 191 
బీజేపీ (BJP)  77 
బీఆర్ఎస్ (BRS)  63 
ఇతరులు 83 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు..!
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు..!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget