TS IT Raids : కొత్తవి కాదు అన్నీ ఇంటర్ లింక్డ్ - తెలంగాణ ఐటీ సోదాల్లో కీలక విషయాలు !
హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సోదాల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు చేసినప్పుడు దొరికిన ఆధారాలతోనే తాజా సోదాలు జరుగుతున్నాయి.
TS IT Raids : తెలంగాణలో ఐటీ శాఖ అధికారులు బట్టల దుకాణాలు, సెల్ ఫోన్ల షాపుల్లో కూడా సోదాలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఆషామాషీగా ఈ సోదాలు చేయడం లేదని పక్కా సమాచారంతోనే దాడులు చేస్తున్నారని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చేసిన ఐటీ సోదాల్లో బయట పడ్డ అంశాల నుంచి కొత్త విషయాలు తెలుసుకుని సోదాలు చేస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, బిగ్ సీ, లాట్ మొబైల్ షో రూమ్స్ లో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను ఈ కంపెనీల యాజమాన్యాలు నష్టాలు చూపిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు.
నష్టాలు వస్తున్నట్లుగా చూపి ఆ సొమ్మునంతా రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి మళ్లింపు
తమ సంస్థలకు నష్టాలు వస్తున్నట్లుగా చూపించి ఆ డబ్బులన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సంస్థ ఆర్థిక లావాదేవీల పైన ఐటి అధికారుల వద్ద కీలక సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థలు తమ నిధులను మరో బినామీ సంస్థ ద ్వారా.. రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మరల్చాయి. ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం ఈ విషయంలో కీలకంగా వ్యవహరించింది. ఓ రియల్ ఎస్టేట్ గ్రూపులో పెట్టిన పెట్టుబడులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఐటీ అధికారులకు ఈ అనుమానం రావడానికి కారణం గతంలో నిర్వహించిన సోదాలే.
ఇటీవల రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాల్లో వెల్లడైన సమాచారంతో తాజా సోదాలు
కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో పలు కీలకమన పెట్టుబడులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇలా వచ్చిన పెట్టబడుల్లో కొన్ని అనుమానాస్పదంగా ఉండటంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీశారు. అవన్నీ బట్టల దుకాణాలు, సెల్ ఫోన్ దుకాణాల సంస్తల నుంచి వచ్చాయని తేలడంతో తీగ లాగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఫినిక్స్ లో ఈ కంపెనీలకు సంబందించిన ట్రాన్సాక్షన్స్ లను గుర్తించిన ఐటీ అధికారు.. దాని ఆధారంగానే సోదాలు నిర్వహిస్తున్నారు.
ఫీనిక్స్ సంస్థలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు బినామీ సంస్థల ద్వారా పంపినట్లుగా గుర్తింపు ?
తెలంగాణలో ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థల కదలికలు పెరిగాయి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ, ఈడీ అధికారులు పలుమార్లు సోదాలు చేశారు. అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు మరికొన్ని అరెస్టులు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.
వివేకా హత్య కేసు సాక్షుల భద్రతపై సందేహం - అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు !