Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - 5 రోజులు భారీ వర్షాలు, ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
Telangana News: తెలంగాణలో రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
IMD Rain Alert To Telangana: తెలంగాణ (Telangana) ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో కోస్తాంధ్రలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమబెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.
సోమవారం నుంచి మంగళవారం వరకూ నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా అతి భారీ వర్షాలు.. అదే సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకూ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో (Hyderabad) ఆదివారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, హైదర్ నగర్, కూకట్పల్లి, మూసాపేట, కేపీహెచ్‌పీ కాలనీ, బాచుపల్లి, ప్రగతినగర్, కీసర, నిజాంపేట్, చర్లపల్లి, నేరెడ్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే 040 - 21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
⚠️ #WeatherAlert
— GHMC (@GHMCOnline) May 26, 2024
Expecting Rainfall and thundershowers today in select areas of Hyderabad. Citizens are requested to stay safe.
For assistance, please contact GHMC-DRF at 040-21111111 or 9000113667. Stay cautious and take care! @CommissionrGHMC #StaySafe pic.twitter.com/zB9bMZ54cW
Also Read: Air Quality Index: మంచిర్యాల గాలిలో నాణ్యత ఎంత? రామగుండం వాసులు పీల్చే గాలి స్వచ్ఛంగా ఉందా?