News
News
వీడియోలు ఆటలు
X

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

Revanth Reddy On TSPSC : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీపై సిట్ విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీపై ఉందన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. TSPSC రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. పరీక్షల నిర్వహణలో అధికార పార్టీ నేతలు తలదూర్చారని ఆరోపించారు. ప్రశ్నా పత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారని మండిపడ్డారు. ఈ లీకేజీకి మంత్రి కేటీఆర్ భాధ్యత వహించాలని, ఆయనను మంత్రివర్గం నుంచి, బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  TSPSC లో ఛైర్మన్ , అలాగే వెంకటలక్ష్మిని జైలుకి పంపాలన్నారు. TSPSC పరీక్షలు రాసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్ 

"నేను చేసిన ఆరోపణలపై ఆధారాలన్నీ సిట్ అధికారికి అందజేశాను. నాకు ఇచ్చినట్లే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని ఫిర్యాదు చేశాను. నేను ఇచ్చిన ఫిర్యాదును ఫిర్యాదు అని కాకుండా, ఇన్ఫర్మేషన్ అని సిట్ చీఫ్ రాసుకున్నారు. మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణం  ఇలాగే జరిగింది. కాంగ్రెస్ ఈ స్కామ్ పై న్యాయ పోరాటం చేస్తే కేసు సీబీఐకి బదిలీ అయింది. వ్యాపమ్ కుంభకోణం విషయం కూడా ఏఆర్ శ్రీనివాస్ కి తెలియజేశాను. వ్యాపమ్ కేసులో 2 వేల మందిని అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ లీకేజీపై సీబీఐ విచారణ జరగాలి. ఆర్థిక లావాదేవీలు జరిగాయి కాబట్టి ఈడీ ఎంటర్ కావాలి. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిందే. ఇందులో NRI లు పరీక్షలు రాశారు. ఈ స్కామ్ లో నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి. హవాలా ద్వారానే ఈ స్కామ్ జరిగింది. దీనిపై ఈడీ కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. దీని వెనుక ఉన్న కుట్రలు బయట పడాలి."- రేవంత్ రెడ్డి 

సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై వ్యవహారంలో సిట్ దర్యాప్తు రాజకీయరంగు పులుముకుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల  అధ్యక్షులకు నోటీసులు ఇచ్చింది సిట్. గురువారం సిట్ ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో కాంగ్రెస్ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సిట్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ తో పాటు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ కార్యాలయం లోపలికి రేవంత్ రెడ్డిని మాత్రమే అనుమతించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో  వాగ్వాదానికి దిగారు. సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.   

Published at : 23 Mar 2023 04:31 PM (IST) Tags: CONGRESS Hyderabad ED TSPSC Revanth Reddy CBI Papers leak

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

Vemula Prashanth Reddy: తెలంగాణ దశాబ్ది సంబరాల నిర్వహణపై మంత్రి రివ్యూ, ప్రణాళిక ఇదీ

Vemula Prashanth Reddy: తెలంగాణ దశాబ్ది సంబరాల నిర్వహణపై మంత్రి రివ్యూ, ప్రణాళిక ఇదీ

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!