అన్వేషించండి

సెల్ఫ్‌ డిఫెన్స్‌ నా బాధ్యత- పోలీసులను కొట్టడంపై షర్మిల రియాక్షన్

తాను ఏమైనా క్రిమినల్‌నా లేదా హంతకురాలినా అని షర్మిల ఫైర్ అయ్యారు. ఎందుకు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

లోటస్ పాండ్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ధర్నాలకు, నిరసనలకు వెళ్లకపోయినా అరెస్టులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సిట్‌ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన తనకు ఆటంకాలు కల్పించడంపై మండిపడుతున్నారు. 

టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. వాటిని నివృత్తి చేసుకోవడానికి సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు బయల్దేరాను అని తెలిపారు. ఒక్కదాన్నే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అందుకే ఉదయం బయల్దేరినట్టు పేర్కొన్నారు. జరుగుతున్న దర్యాప్తుపై అధికారులను కలిపి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు. 
కీలకమైన కేసుల్లో దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమకు ఉన్న అనుమానాలు అధికారులకు చెప్పడం తమ బాధ్యత అన్నారు షర్మిల. అందుకే సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు బయల్దేరిన తనను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారన్నారు. సిట్ ఆఫీస్‌కు వెళ్లడానికి కూడా ఎవరి అనుమతి  అవసరం లేదన్నారు. దీనిపై ఎవరికీ చెప్పాల్సిన పని కూడా లేదన్నారు. తాను ఏ ధర్నాకో ముట్టడికో పోలేదని అలాంటప్పుడు తనను ఎదుకు నిలువరించారని ప్రశ్నించారు. 

తాను ఏమైనా క్రిమినల్‌నా లేదా హంతకురాలినా అని షర్మిల ఫైర్ అయ్యారు. ఎందుకు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగత స్వేచ్చ ఉందా లేదా అని క్వశ్చన్ చేశారు. అసలు తన ఇంటి ముందు వందలాది మంది పోలీసులను ఎందుకు పెట్టారని అడిగారు. వ్యక్తిగత పనులపై తిరిగే స్వేచ్ఛ కూడా తనకు లేదా అని అన్నారు. 
బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు షర్మిల. తన దారిన తాను వెళ్తుంటే అడ్డుపడ్డారన్నారు. తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఎవరైనా తనపై పడితే భరించలేనని తన రక్ష కోసమే అలా నెట్టేయడం జరిగిందని వివరణ ఇచ్చారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌ తన బాధ్యత అన్నారు షర్మిల. తనను పురుష సిబ్బంది ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. 

ఉదయం నుంచి లోటస్ పాండ్‌ వద్ద హైడ్రామా నడిచింది. సిట్‌ ఆఫీస్‌కు వెళ్లేందుకు బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. తను అడ్డుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తను అడ్డుకున్న పోలీసులుపై ఫైర్ అయ్యారు షర్మిల. అసలు తనను ఆపే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహహం వ్యక్తం చేశారు. పోలీసులు రిక్వస్ట్ చేస్తున్నా... షర్మిల ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు, ప్రభుత్వం చర్యలకు నిరసగా అక్కడే నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. ఒంటరిగా రోడ్డుపై కూర్చున్న ఆమెను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే తను పదే పదే అడ్డుకుంటున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై సీరియస్‌ అయ్యారు. కానిస్టేబుల్స్‌ నుంచి విదిలించుకొనే క్రమంలో ఆమెపై చేయిచేసుకున్నారు. తర్వాత నడుచుకుంటూ ఫాస్ట్‌గా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. 

ఇంతలో షర్మిల ఆదేశాలతో కారు తీసేందుకు తన డ్రైవర్ ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఎస్సై ఆ డ్రైవర్‌ను బయటకు లాగిపడేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల... తన డ్రైవర్‌పై ఎందుకు చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. అసలు తన డ్రైవర్‌పై చేయి చేసుకోవడానికి మీరు ఎవరూ అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఎస్సైపై చేయి చేసుకున్నారు. షర్మిల చర్యతో షాక్ తిన్న ఎస్సై కాసేపటికి తేరుకొని తిరిగి సమాధానం ఇచ్చారు. అసలు తనను కొట్టడానికి మీరెవరూ అంటూ నిలదీశారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తనను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై ఆగ్రహించిన షర్మిల రోడ్డుపైనే కూర్చొని ధర్నా చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Seats: లోక్‌సభ 26, అసెంబ్లీకి గరిష్టంగా 182! డీలిమిటేషన్‌తో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం
లోక్‌సభ 26, అసెంబ్లీకి గరిష్టంగా 182! డీలిమిటేషన్‌తో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget